AWednes day



A Wednesday :

 క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ బాటింగ్ చేస్తున్నాడంటే ఫీల్డర్ లందరూ ఎలర్ట్ గా వుంటారు .. ఒక్కసారి సచిన్ బాటింగ్ స్టార్ట్ చేస్తే, ఫీల్డర్ లందరూ పరిగెత్తడమే పని గా వుంటారు ... ఇది 

పాయింట్ 1 ...
ఒక ఆడామగా బైక్ మీద వెళ్తున్నారంటే వాళ్ళని ఫస్ట్ లవర్స్ అనుకుంటాము తర్వాత భార్యాభర్తలు అనుకుంటాము .. చివరిగా అన్న - చెల్లి అనుకుంటాము .. అంటే మనం ఏ సంఘటన జరిగినా అందులో నెగటివ్ గానే చూడడం మొదలుపెట్టి .. చివర్లో పాజిటివ్ గా అనుకుంటాము ... 

ఇది పాయింట్ 2 ...
రెండు పాయింట్ లను కలిపితే "వెడ్నస్ డే" స్క్రిప్ట్ ...
ఒక వ్యక్తి తను ఉన్న ప్లేస్ నుండి కదలకుండా పోలీసుల్ని, మీడియా ని పరుగులెట్టిస్తాడు ... బయపెట్టిస్తాడు ... చివర వరకు టెన్షన్ గా సాగించి ... తనొక సామాన్యుడినని .. తన కోపం బయట పెడతాడు ... ఇంతా చేసిన వ్యక్తి టెర్రరిస్ట్ కాడు ... టెర్రరిస్ట్ లను చంపాలనుకున్న సామాన్యుడు ... ఇదే చిన్న కధ .. చిన్న ఐడియా
          -----OK -----------Coming to the point---------

Main points

1.     కధ లో నవరసాలు లేనప్పుడు స్క్రిప్ట్ చాలా క్రిస్పీ గా వుండాలి ... ప్రేక్షకుడి కి ఆలోచించే ఛాన్స్ ఇవ్వకూడదు .. అలా ఉన్నప్పుడే ప్రేక్షకుడు హాల్ లో కూర్చోగలడు .. లేక పోతే బోర్ కొట్టి వెళ్ళిపోతాడు ...

ముఖ్యం గా కధ లో లవ్ లేదు, కామెడీ లేదు ... వున్నది ఒక్కటే టెన్షన్ .. పేస్ .. ఏమి జరగబోతుంది? నశీరుద్దిన్ షా ని పట్టుకుంటారా లేదా? బాంబ్స్ అన్ని పేలితే ముంబై అమవుతుంది? ఉత్సుకత తోనే సినిమాని నడిపారు ...
మనిషి మనసుకు అందని ఒక ప్రశ్నకు .. గంటన్నరవరకు సమాధానం దొరకకుండా .. చివర్లో దొరికే సరికి హ్యాపీ గా ఫీల్ అవుతాడు ... సమాధానం కుడా ప్రేక్షకుడ్ని మెప్పించేదే ..ఇటువంటి కధ లు ఒకప్పుడు "జోషి" అనే డైరెక్టర్ నుండి వచ్చేవి ..

Example: న్యూ డిల్లి డైరీ
2.     ఇలాంటి కధ, ఐడియా తట్టగానే ముందు క్లైమాక్స్ ని ఫిక్స్ చేసుకుంటారు ... అక్కడకు కధ చేరాలంటే .. ఎక్కడనుండి మొదలు పెట్టాలి? ఎలా పోలీసుల్ని కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి? పోలీసులు వేసే ఎత్తులకు ఎలా తప్పించుకోవాలి? ఇవి అన్ని తెల్సుకుని వన్ బై వన్ స్క్రిప్ట్ లో పెట్టుకుంటూ వస్తారు ..
3.     లీగల్ గా టెర్రరిస్ట్ లను పోలీసుల ద్వారానే బయటకు తెప్పించి చంపాలి ..
అందుకు ఫస్ట్ స్టెప్: ముంబై లో అన్ని ప్లేసెస్ లో బాంబ్స్ పెట్టడం, పోలీస్ కంట్రోల్ రూం లోకూడా బాంబు పెట్టడం నశీరుద్దిన్ షా చేస్తాడు ...
ఒక ఫోన్ కాల్ తో పోలీసులు అలెర్ట్ అవుతారు .. రంగం లోకి దిగుతారు ... ఫస్ట్ బాంబు ని పోలీస్ కంట్రోల్ రూం లో పెట్టాను 10 నిముషాల్లో పేల్తుంది .. అని చెప్పి క్లూ ఇస్తాడు .. దాన్ని పట్టుకుంటారు .. ఇన్సిడెంట్ వలన  పోలీసులు నశీరుద్దిన్ షా ని నమ్మక తప్పదు ...ఇక్కడ అందరమూ నెగటివ్ గానే ఆలోచించడం మొదలుపెడతాము ... ఎందుకంటే స్టార్టింగ్ లో నసీరుద్దిన్ షా ఒక దగ్గర బ్యాగ్ వదిలేస్తాడు ..


4.First step : పోలీసులను కంట్రోల్ లోకి తెచ్చుకున్నాడుSecond step : మీడియా ని కాంట్రోలోకి తెచ్చుకున్నాడు
కానీ పోలీసులు మాట వినరు కదా ... వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తూనే వుంటారు ...నశీరుద్దిన్ షా ని పట్టుకోవడానికి స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ జిమ్మీ షర్గిల్ (ఆరిఫ్ ఖాన్) .
ని నియమిస్తారు.. అన్ని విధాల ట్రై చేసిన పోలీస్ ఆఫీసర్ ఇంటర్వెల్ కల్లా ఫెయిల్ అవుతాడు ... మిగిలింది సెకండ్ హాఫ్..
5.అన్ని దారులు ముసుకున్నాయి ... చేసేదేమీ లేదు .. నశీరుద్దిన్ షా మాట వినాలి ... నలుగురు టెర్రరిస్ట్ ని బయటకు తీసుకురండి .. వారిని పలానా ఎయిర్ పోర్ట్ దగ్గర పెట్టండి అని ఆదేశాలిచ్చాడు ... వెళ్ళగానే బాంబు పేల్చాడు ... ముగ్గురు చచ్చారు .. ఒకడ్ని ఆరిఫ్ బ్రతికించాడు .. . మెయిన్ క్యారెక్టర్ లక్ష్యం నెరవేర లేదు ... అందుకే మిగిలిన వాడ్ని చంపన్నాడు ... మీడియా వచ్చే లోపు చంపాలి ... అని ఆదేశించాడు ... అలాగే చంపారు .
6.ఒక్కడే కధను నడపాలంటే క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా వుండాలి ... మాటల్లో .. ఆలోచనల్లో ... అమలు పరచడం లో ... నిర్ణయాల్లో ...




ఇతనికి తగ్గట్టే మిగిలిన క్యారెక్టర్ లు అన్నీ స్ట్రాంగ్ గా వుండాలి ...
అనుపమ్ ఖేర్, జిమ్మీ షర్గిల్ ... జై దీప్ సింగ్ .... ఇలాంటివి ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేసేవి వుండాలి ... అలా ఉంటేనే టగ్ అఫ్ వార్ గా వుంటూ, నశీరుద్దిన్ షా ని పట్టుకుంటారు లే అని నమ్ముతాము .లేకపోతే సినిమా కధ వీక్ గా వుంటుంది... ఇదే విషయాన్ని మనం టాగోర్లో చూస్తాము...

7.ప్రేక్షకుడ్ని మిస్ గైడ్ (తప్పుదారి) చేసే కొన్ని షాట్స్ / సీన్ లు ఇందులోనూ వాడారు .. అవి లేకపోతే సినిమా ఐడియా ఏమాత్రం పేలదు ..

A)స్టార్టింగ్ లో నశీరుద్దిన్ షా రక రకాల ప్లేసెస్ లో బ్యాగ్స్ పెట్టడం
B) టెర్రరిస్ట్ తో పాటు నశీరుద్దిన్ షా ని క్లోజ్ అప్ లో చూపించడం .. డిస్కస్ చేయడం
C)అర్.డి. ఎక్ష్ .. అమ్మిన ఒక వ్యక్తి  interrogation లో నశీరుద్దిన్ షా స్కెచ్ చూసి "ఇతనికే ఇచ్చాను" అని చెప్పడం ..

ఇవి కరెక్ట్ గా చూపారు కాబట్టి నశీరుద్దిన్ షా ని టెర్రరిస్ట్ అని అనుకోవడానికి స్కోప్ చాలా ఎక్కువగా వుంటుంది ...

Example : “
అన్వేషణలో మనకు అందరిమీదా డౌట్స్ వస్తాయి .. అలాగేచంద్రముఖిలో ఒకొక్కరిమీదా డౌట్స్ వస్తాయి ... అలా వస్తేనే స్క్రిప్ట్ సక్సెస్ అయినట్టు ... ఎందుకంటే మెయిన్ పాయింట్ ప్రీ క్లైమాక్స్ లో ఓపెన్ అవుతుంది కాబట్టి ... అప్పటి వరకు ఆట కొనసాగాలి కదా....!
8. ఫస్ట్ హాఫ్ లో ప్లే
1.
నశీరుద్దిన్ షా ని పట్టుకోవడానికి ప్రయత్నం .. విఫలం
2. సెకండ్ హాఫ్ లో ప్లే నశీరుద్దిన్ షా చెప్పినట్టు పోలీసులు వినడం ...

9. ఫస్ట్ హాఫ్ లో నైనా (మీడియా అమ్మాయి) తో అనుపమ్ ఖేర్ మాటలు వినపడనీయకుండా చేస్తారు ... అక్కడ ప్రేక్షకుడు ఆలోచిస్తాడు .. ఏమి చెప్పాడో అని ..
సెకండ్ హాఫ్ లో ఆరిఫ్ ఖాన్ ని జై సింగ్ ద్వారా చంపుదామని - అనుపమ్ ఖేర్ మాటలు .. అది ఆరిఫ్ ఖాన్ వినడం ... ఇక్కడ ఏమి జరుగుతుందో ... అని కుడా ప్రేక్షకుడు ఆలోచిస్తాడు ..
ఇవి ఉంటేనే ప్రేక్షకుడు అప్పటికప్పుడు విధం గా ఆలోచిస్తాడు .. తీర ఏమి వుండదు ... కొన్నిటిలో రీజన్ వుంటుంది ...

10. Climax : నశీరుద్దిన్ షా మాటలు .. స్టుపిడ్ కామన్ మాన్ ... అనే మాట తో అందరమూ కనెక్ట్ అవుతాము ... ఎందుకంటే తీవ్రవాద దాడి లో బాలి అయ్యేది సామాన్యులే కాబట్టి ... ఇంతవరకు తక్కువ మాటలతో సాగి...... ఒక్కసారిగా డైలాగ్స్ తారాస్తాయికి చేరుతాయి ... అతని ఆలోచన, బాధ వ్యక్తం అవుతాయి .. ముంబై ట్రైన్ లో జర్నీ చేసే వాళ్ళందరి గురించి డిస్కస్ చేసాడు .. బాగా కనెక్ట్ అయ్యేలా చేసాడు ... థాంక్స్  నీరజ్ పాండే ...

11. ఇలాంటి సినిమాలకు కెమెరా కుదురుగా ఉండకూడదు ... పరిగెత్తాలి .. క్యారెక్టర్ తో పాటు పరిగెత్తాలి .... అప్పుడే స్క్రిప్ట్ కి పేస్ వస్తుంది ...
యముడు (సూర్య), పోలీస్ స్టొరీ (సాయికుమార్) సినిమాల్లో ఇదే జరుగుతుంది ...

12.Script points :

Startingpoint : నశీరుద్దిన్ షా రకరకాల ప్లేసెస్ లో బ్యాగ్ లు పెట్టడం
Plot point1 : నశీరుద్దిన్ షా అనుపమ్ ఖేర్ కి ఫోన్ కాల్ చెయ్యడం
Mid point నశీరుద్దిన్ షా ని పట్టుకునే ప్రయత్నం విఫలం .. జిమ్మీ షర్గిల్ (ఆరిఫ్ ఖాన్) ఫెయిల్
Pointpoint 2: నశీరుద్దిన్ షా చెప్పినట్టు టెర్రరిస్ట్ ని బయటకు తీసుకురావడం
Pre climax : టెర్రరిస్ట్ లను బాంబు బ్లాస్ట్ చేయడంclimax End point  :  అనుపమ్ ఖేర్ - నశీరుద్దిన్ షా ని కలసి షాకే హ్యాండ్ తీసుకోవడం