MayaBazar


మాయా బజార్

1957 మార్చి 27 న విడుదల అయిన ఒక తెలుగు సినిమా ఇప్పటికీ సజీవంగా వుంది .. తెలుగు వాడి కీర్తి ని ఖండాంతరాలకు ఇనుమడింప చేసింది ... అంటే 56 ఇయర్స్ ... నాట్ ఎ జోక్ ...ఇందులో పని చేసిన అందరూ ప్రపంచం మునిగి పోయే వరకు బ్రతికే వుంటారు .. వాళ్ళ నటన అటువంటిది ... వాళ్ళని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం అటువంటిది ... అద్భుతాలు తీసిన కెమెరామెన్ ప్రతిభ రోజులు తరబడి పొగడాలి ... పాటలు వింటూనే వుండాలి ... అది పాత తరం ప్రతిభ ... ఆ తరం నుండి ఈ తరం ఎంతో నేర్చుకోవాలి ... నేర్చుకుందాము ...

Script Points :

1.మాయాబజార్ అనే బజార్ లేదు ... ముఖ్యం గా భారతం లో అభిమన్యుడి కి శశిరేఖ కి పెళ్లి జరిగింది .. కానీ అది ప్రేమ వివాహం కాదు ... అది ప్రేమకధ అయితే .... వాళ్ళిద్దరూ చిన్ననాటి నుండి కలసి తిరిగి, పెరిగి ప్రేమించుకుంటే ….పెద్దలు అడ్డు పడితే ... శ్రీకృష్ణుడు వారికి తోడుగా నిలబడి, వాళ్ళకి పెళ్లి చేస్తే .. అనే ఊహల్లోంచి పుట్టిన కధే "మయా బజార్" ....
"ఊహలు సామ్రాజ్యాలను సృస్టిస్తాయి .." ... అని మిక్కీ మౌస్ సృష్టికర్త వాల్ట్ డిస్నీ ఊరికే చెప్పాడా .... అందుకే ఊహలు చాలా బాగుండాలి .. ప్రేక్షకుడ్ని కొత్త లోకం లోకి విహరింప చేయాలి .. అప్పుడే ఆ ఊహకు అర్ధం, పరమార్ధం ...
ఫాంటసీ పాయింట్ ని రియాలిటీ లోకి తెస్తే హిట్ గ్యారంటీ ... ఈ కాన్సెప్ట్ చాలా సినిమాల్లో రుజువయ్యింది .. (జురాసిక్ పార్క్ .. అవతార్ .. ఈగ ... చాలా వున్నాయి)

2. స్క్రీన్ ప్లే ప్రకారం సినిమా స్టొరీ పాయింట్ ... సినిమా స్టార్ట్ అయిన 10 -15 నిముషాల లోపు చెప్పాలి ...
శశిరేఖ (చిన్నతనం లో) ను అభిమన్యుడి కి ఇచ్చి పెళ్లి చేస్తామని బలరాముడు - తన చెల్లెలు సుభద్రకు మాట ఇస్తాడు .. దీని మీదే కదా అంతా నడుస్తుంది ... (మర్యాద రామన్న, జగదేక వీరుడు అతిలోక సుందరి ఇలా చాలా సినిమాల్లో పాయింట్ ని త్వరగానే చెబుతారు ...)

3.Planting and payoff : మనసులో ఏమున్నదో అంతా చెప్పించే శక్తి కలిగిన సత్యపీటిక స్టార్టింగ్ లోనే చూపిస్తారు .. (. ప్రియదర్శిని ని ససిరేఖకి ఇచ్చే టైం లో) .. దీన్ని ప్రీ క్లైమాక్స్ లో తీసుకు వచ్చి శకుని తో నిజం కక్కిస్తారు ...

4. Screenplay Tricks: ప్రియ దర్శిని చూసే తప్పుడు ఎవరెవరు చూసారో ... దాని సారామ్సమే ఈ సినిమా కధ .. సినిమా కధ ఇది .. దీని చుట్టూ తిరుగుతుంది అని ముందుగానే హింట్ ఇవ్వాలి .. అదే చేసారు ..

A.శశిరేఖ ప్రియదర్శిని లో చుస్తే - అభిమన్యుడు కనిపిస్తాడు ... ప్రేమ లో వుంది కాబట్టి ..

B.బలరాముడు చూస్తే దుర్యోధనుడు కనపడతాడు .... ఇతని తో నే సంభంధం కలుపుకునేది కాబట్టి ...

C.బలరాముడి భార్య చూస్తే (ఛాయా దేవి) నగలు కనపడతాయి ... దాని అర్ధం డబ్బు కి వేల్యూ ఎక్కువ ఇస్తుందని .. ఈ క్యారెక్టర్ వలెనే ఆడిన మాట తప్పుతుంది ...

D.చివరిగా కృష్ణుడు చూస్తే శకుని కనపడతాడు .. అందుకంటే కధలో కీలకం అయిన మార్పు అతని వలెనే వస్తుంది కాబట్టి ....
అక్కడే కృష్ణుడి చెల్లెలు సుభద్ర వుంటుంది .. ఆమె చూడదు .. ఎందుకు ... కధ కి అవసరం లేదు. కాబట్టి
(ఇలాంటి హింట్ నే ఇండిపెండెన్స్ డే, జురాసిక్ పార్క్, ఒకే ఒక్కడు లో చూస్తాము)

5.Plotpoint 1: కౌరవుల మీద కోపం తో వెళ్ళిన బలరాముడు .. దుర్యోధనుడి మర్యాదలకు, సత్కారాలకు పొంగి శశిరేఖ ని లక్ష్మణ కుమారునికి (రేలంగి కి) ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు .... ఇదే కధ ని పాతదారి నుండి కొత్తదారిలోకి తీసుకు వెళ్తుంది ...

6.Subplot : ప్రేమకధ మెయిన్ కధలో కలసిపోయి వుండాలి .. కానీ వేరుగా కనపడకూడదు ... అభిమన్యుడు శశిరేఖ ల మధ్య ప్రేమ ... కలసి తిరగడాలు , పాటలు పాడుకోవడాలు., పెద్దల ద్వారా విడిపోవడాలు , కృష్ణుడి లీల ద్వారా కలయిక అన్నీ ప్రతీ ప్రేమ కధ లో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ వుంటాయి . చివరకు పెళ్లి అవ్వటం తో ఈ ప్రేమ కధ సమస్య తీరి పోతుంది 

7.Act 1: స్టార్టింగ్ నుండి బలరాముడు దుర్యోధనుడికి మాట ఇచ్చే వరకు ఒక అంకం….
   Act 2: శశిరేఖ - అభిమాన్యుల ప్రేమ -విరహానికి, విడిపోడానికి గురై   .ఘటోత్కచునిపరిచయం .. అభిమన్యునితో యుద్ధం వరకు ఇంకొక అంకం
   Act 3: శ్రీ కృష్ణుడు - ఘటోత్కచుని చేత ఆడించే పరకాయప్రవేశం మొదలు - చివర వరకు మిగిలిన అంకం

8. “play” in Screenplay : (ప్రేక్షకుడి కి తెలిసి క్యారెక్టర్ లకు తెలియని పాయింట్ తో ఆడే ఆట)
ఘటోత్కచుడు (ఎస్ .వి రంగారావు ) --శశిరేఖ లా (సావిత్రి ) లా మారిపోయి చేసే అల్లరి ప్రేక్షకుడి కి తెలిసినది ..మిగిల క్యారెక్టర్ లకు తెలియంది ..ఒక్క కృష్ణుడి కి తప్ప ...ఈ ప్లే చాలా బాగుంటుంది ...సావిత్రి వస్తుంటే ఘటోత్కచుడు వసున్నాడని పిస్తుంది..అంతే నవ్వులే నవ్వులు ..ఈ ప్లే ప్రీ క్లైమాక్స్ లో ఓపెన్ అవుతుంది ....

9.Creativity : అప్పటివరకు చూడనివి .. ఊహించనివి .. అదే క్రియేటివిటీ
A.పాండవులు కనిపించకుండా  సినిమా ని రన్ చేయడం
B.ఘటోత్కచుని మాయలు ..అతని శిష్యుల మాయలు
C.ఘటోత్కచుడు శశిరేఖ  లా మారిపోయి ఆడే ఆట
D.ప్రియదర్శిని అనే పెట్టెలో ఇష్టమైనది కనిపించడం ..అందులో ఒక సాంగ్
E.సత్య పేటిక  ఎక్కితే నిజం చెప్పడం
F.కమెడియన్ రేలంగికి -హీరోయిన్ సావిత్రికి  మధ్య సాంగ్
G.కృష్ణుడు ముసలి వాడుగా ఘతోత్కచున్ని  ఏడిపించడం
H.అన్నదమ్ములయిన  అభిమన్యుడి కి  ఘతోత్కచునికి మధ్య యుద్ధం
I.వినని పదాలు -అస్మదీయులు/తస్మదీయులు ..కంబలి-గింబళి

10. స్క్రిప్ట్ బాగుంటే సరిపోదు ...దానికి తగ్గ నటులు కావాలి ..వాళ్ళందరినీ ఉపయోగించుకునే  డైరెక్టర్ కావాలి ...గ్రాఫిక్స్ లేని రోజుల్లో గాలిలో యుద్ధాలు తీయగల నేర్పు,చిన్నగా వున్న వాళ్ళని పెద్దగా చూపగల నేర్పు వున్న కెమెరామెన్ వుండాలి ...మంచి మాటలు..పాటలు వుండాలి ...ఇవన్నీ వున్నాయి కనుకనే ఇది మహా కావ్యం అయ్యింది ....

0 comments:

Post a Comment