Aithey



Ø ఇలాంటి సినిమా ఒకటి వచ్చిందా అని - నేటి కాలం యువత కి చాలామందికి తెలియదు ... యూత్ అంటే బూతు సినిమా అని నిర్ణయించిన పరిస్తితులు నేడున్నాయి .. కాబట్టి తప్పు వాళ్ళది కాదు ….
Ø ఖలేజా లో ఒక డైలాగ్ వుంది ..."ఒక అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు ... అద్భుతం జరిగాక ఎవరూ చర్చిన్సాల్సిన అవసరం లేదు .." అని ... ఇది కరెక్ట్ గా చంద్రశేఖర్ యేలేటి కి , అతను తీసిన "ఐతే" సినిమాకు వర్తిస్తుంది ....
Ø స్టార్టింగ్ సినిమా .. ఒక చిన్న సినిమా ... ఎంత బలంగా స్క్రీన్ మీద తాకిందంటే ... అప్పటి యూత్ అంతా "మరొక రాంగోపాల్ వర్మ లాంటి వాడు వచ్చాడ్రా ఇండస్ట్రీ కి" అని అనేలా చేసాయి ....
Ø ఒక చిన్న సినిమా తీయాలనుకున్న వారు ఎవరైనా "ఐతే" ని స్ఫూర్తి గా తీసుకోవాల్సిందే ...
Ø ఒక ఐడియా ని .... సైకలాజికల్ పాయింట్ తో స్క్రీన్ ప్లే నడిపి ... యూత్ కి సరిఅయిన నిర్వచనం చెప్పాడు ... అందుకే తీసింది కొన్ని సినిమాలే అయినా .. గుర్తుంచుకునేలా తీసాడు .. తీస్తాడు ...
              --Ok ---coming to the point -----------

Script points :

1.Thriller Film is a genre that revolves around anticipation and suspense. The aim for Thrillers is to keep the audience alert and on the edge of their seats.

త్రిల్లర్స్  ఎప్పుడూ రెండు అంశాల చుట్టూ తిరుగుతాయి.

1 ఏమి జరిగి వుంటుంది .. (సస్పెన్సు)

2. ఏమి జరగబోతుంది ..... (ఉచ్చుకత)
ఈ రెండింటి లో రెండో పాయింట్ ని .. ప్రేక్షకుడి సైకాలజీ తో ముడి పెట్టి ఫస్ట్ హాఫ్ నడిపాడు ... అక్కడే సక్సస్ అయ్యాడు ...
కధలో నలుగురు కుర్రాళ్ళు కావాలని - మాఫియా డ్రగ్ డాన్ అంటాడు ... ప్లాన్ మొత్తం చెబుతాడు .. ఇంకో పక్క నలుగురినీ చూపిస్తుంటాడు .. వీళ్ళు కుడా ప్లాన్ వేస్తారు .. అది చెప్పడు ... (ఆ సీన్ షాట్ లు కట్ చేసాడు) .. ఇద్దరు ఒకే ప్లాన్ లో బాగం అనుకుంటాము .. కానీ వేరు వేరు ప్లాన్స్ అని ఇంటర్వెల్ దగ్గర తెలుస్తుంది ... అదే స్క్రీన్ప్లే పాయింట్ ... ప్రేక్షకుడిని ఒకేలా అలోచించి ఇంకో వైపు దెబ్బకొట్టడం ... మైండ్ బ్లాక్ అవుతుంది ..
 ప్లస్ పాయింట్:. 1 యువత తప్పు దారి పడుతుందేమో అన్న భయం, బాధ .. పాపం డబ్బు కోసం తప్పదేమో అన్నట్టు వుంటుంది ... తీరా ఇంటర్వెల్ చేరే సరికి "యువత" చేసేది కరెక్ట్ అనిపించాడు ...
అందుకే ఈ సినిమా "అన్ని సినిమాలు ఒకేలా వుండవు" అనే కాప్షన్ తో వచ్చి 1కోటి పెడితే
 5 కోట్లు రాబట్టింది .... అదే ఒక ఐడియా కున్న పవర్ ...

2.The tension with the main problem is built on throughout the film and leads to a highly stressful climax.


నలుగురు యువకులు ఎంతో గొప్ప ప్లాన్ వేసి కష్టపడి మాఫియా డాన్ ని పట్టుకున్నారు .. ఇది ఫస్ట్ హాఫ్ ... తెలివితేటలు ఒక దశలో బాగా వుంటాయి .. వర్కౌట్ అవుతాయి .. కొన్ని సార్లు చెండాలంగా వుంటాయి .. వర్కౌట్ కావు ..
అదే సెకండ్ హాఫ్ ... ఇంత తెలివితేటలు వున్నవారు సెకండ్ హాఫ్ ఆ డాన్ మీద పెట్టిన ప్రైజ్ మనీ కోసం పాట్లు పడతారు ... ఎన్నో ప్లాన్స్ వేస్తారు .. ఇబ్బందులు పెరుగుతూ .. చివరికి ప్రాణాల మీదకు వస్తుంది ... అంతే ఫ్రెండ్షిప్ విరిగిపోయింది అనే దశ లో అందరు కలసి వెనక్కి వెళ్ళిపోతారు. .. చివర్లో కష్టానికి ఫలితం దొరుకుతుంది ... ఇది చివరి వరకు కాస్త టెన్షన్ గా నడిపారు .... అందుకే ఈ ఫిలిం సక్సస్ ...

Contrast Nature Characters:

సినిమా లో వున్న క్యారెక్టర్ లు ఒకొక్కరు ఒకో విధం గా వుంటారు .. వాళ్ళ ఆలోచనలు ... మాటలు .. ప్రవర్తన ... ఎస్టాబ్లిష్ చేసే సీన్ లు కొత్తగా వుంటాయి .. (వాళ్లకి వున్న ప్రొబ్లెమ్స్ అన్నీ మనీ చుట్టూ తిరిగి - ప్లాన్ వేసే విధం గా దారి తీస్తాయి ... )
Script clue :

1.స్క్రిప్ట్ లో హీరో / హీరోయిన్ కి లక్ష్యం వుంటే అది చివర్లో .. అంటే క్లైమాక్స్ లో అందుకోవాలి .. లేదా సాధించాలి ... మధ్య లో అంతా ఇబ్బందులు, ఆనందాలు, బాధలు, సాహసాలు, త్యాగాలు, వాదాలు, అపార్ధాలు - కలవడాలు .... ఇలా అన్ని పాళ్ళు ఉండేలా చూసుకుంటే చాలు .... స్క్రిప్ట్ హిట్ అవుతుంది ….




2. స్క్రిప్ట్ లో ఒకటే ప్రధాన సమస్య వుండాలి .. అది ఎన్ని మలుపులు తీసుకున్నా, ఎన్ని వేర్లు వున్నా పర్లేదు .. ఆ సమస్య సెకండ్ హాఫ్ వెళ్తున్న కొద్దీ పెరుగుతూ వుండాలి ... హీరో కొంచెం సాధిస్తూ .. కొంచెం వెనక పడుతూ వుండాలి ... చివరికి ఆ సమస్య సాల్వ్ అవ్వాలి ... .అది స్క్రిప్ట్ లో ముఖ్యమైన బాగం ...
Creative clue :
ఒసామా బిన్ లాడెన్ ని పట్టుకుంటే 10 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించారు పేపర్లో .. ఆ ప్రకటన చూసి యేలేటి కధ అల్లాడు .. అంటే న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ కుడా స్టొరీ లు పుట్టడానికి కారణం అవుతాయి .. సో పేపర్ బాగా చదవండి .. చాలా ప్లాట్ లైన్స్ పుడతాయి ...

0 comments:

Post a Comment