Artical-10


Article-10
సినిమా హిట్ అవ్వాలంటే?
ప్రేక్షకుడి మనస్సు .. అతని ఆలోచనదోరనే సినిమా హిట్ కి మూల కారణాలు ... సైకాలజీ పట్టుకున్న వాళ్లకి సినిమా కధ రాసుకోవడం ... స్క్రీన్ ప్లే అల్లుకోవడం ... హిట్ కొట్టడం అనేది చాలా సింపుల్ .... ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకుడి ని దృష్టిలో పెట్టుకుంటే - గొప్ప సినిమాలు. . హిట్ సినిమాలు తీయవచ్చు ....
Step 1: ప్రశ్న: సినిమా కధ తీయబోయే ముందు - ఎలాంటి కధ, స్క్రీన్ ప్లే వుంటే ప్రేక్షకుడుకి సినిమా కొత్త గా వుంటుంది?
అంటే మీరు రాసిన, మీరు విన్న కధలు లేదా లైన్ లు - లేదా అలాంటి కధలు.....
 ఆల్రెడీ ప్రేక్షకుడు చుసాడా? ..
చూసాడు -అనే మాట (ఆత్మ విమర్శ తో వస్తే) సినిమా కధ పక్కన పెట్టవచ్చు ...
 టైం, మనీ సేవ్ అవుతాయి ....
చూడలేదు... అనే మాట వస్తే .. ముందుకు వెళ్ళవచ్చు ....
అంటే లైన్ తీసుకోవడం లోనే కొత్తదనం వుండాలి .. బలేగుందే పాయింట్ అనేలా వుండాలి ... అది లేక చాలా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి ... మనం కుడా ప్రేక్షకులమే - ఒక్కసారి సినిమా తీస్తే .... పోస్టర్ చూసి ... మీరు బస్సు దిగి సినిమా హాల్ కి వెళ్ళగలరా ? ప్రశ్న చాలు సరి అయిన సినిమా కధ రాసుకోవడానికి ....
ఓకే... నౌ .. లైన్ వచ్చింది ....
Step 2: సినిమా లైన్ ఒకే .. మంచి స్కెలిటన్ స్ట్రక్చర్ తో ప్లాట్ పాయింట్స్ తో ... స్క్రిప్ట్ పూర్తి అవుతుంది .... ఓకే 
స్క్రిప్ట్ = కధ + స్క్రీన్ ప్లే + మాటలు ..
మూడు కలసిన బౌండ్ స్క్రిప్ట్
ఇందులో రెండు సరిగ్గా వున్నా సినిమా హిట్ అవుతుంది ..
అది అందరికీ తెలిసినదే ...సినిమాకు అన్నీ రెడీ ...ఒక్కసారి తీసే  ముందు ...చూసేది ఎవరు ? అని ప్రశ్నించుకుంటే ....అతని పాయింట్ అఫ్ వ్యూ లో  ప్రేక్షకుడు గురించి ఒక్కసారి ఆలోచిద్దాము ...ఓకే ...
                                   --------ok------------
కధలు రెండు రకాలు
1.మనది అయిన కధ ...
2.మనది కాని కధ ...
1.మనది అయిన కధ ...
మనది అయిన కధ లో మనం త్వరగా కనెక్ట్ అవుతాము ... మన సరదాలు, అల్లర్లు ... చిన్న లవ్ లు .. డిఫరెంట్ ఫ్రెండ్స్ ... డిఫరెంట్ ఆలోచనలు...... ఎయిమ్స్ ... మనం చూసే సమస్యలు ... కాన్ఫ్లిక్ట్ లు ... సంఘర్షణ వలన విడిపోవడాలు. .. మళ్ళీ కలవడాలు .... కధ ప్రకారం సొల్యూషన్ ...
( దిల్ చాహతా హై .. హ్యాపీ డేస్ ... బొమ్మరిల్లు ... రంగ్ దే బసంతి ...)
2.మనది కాని కధ ...
మనది కాని కధలన్నీ కమర్షియల్ కధలే ...
హీరో క్యారెక్టర్ పైన సానుభూతి అయినా కలగాలి ...( మర్యాద రామన్న ..)
లేదా.... వాడిని ఇష్ట పడేలా అయినా వుండాలి .. (తమ్ముడు ... ఖుషి..)
లేదా బలే డిఫరెంట్ గా వున్నాడే .. అని అయినా అనిపించాలి....( డాన్ శీను ... కిక్)
Analysis :
ప్రేక్షకుడు ---మెయిన్ క్యారెక్టర్ .. అతని ఆలోచనలు , ఎయిమ్స్ , ప్లే , మాటలు ,చేతల తో ట్రావెల్ చేయాలి . ట్రావెల్ లో నిజాయితీ వుంటే , క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతూ ఉంటాడు ... ఒక్కసారి కనెక్ట్ చేస్తే ... మెయిన్ క్యారెక్టర్ కి సమస్యలు ఎదురైతే ,అప్పుడు మెయిన్ క్యారెక్టర్ ప్రేక్షకుడు ఊహించనిరీతిలో స్పందిస్తే .. సమస్య కి కొత్త పరిష్కారం చెబితే .. ప్రేక్షకుడి కి తెలియని ఇంకొక కోణాన్ని ఆవిష్కరిస్తే .. చెబితే ... ప్రేక్షకుడు క్యారెక్టర్ ని మెచ్చుకుంటాడు .. గుండెల్లో చప్పట్లు కొడతాడు ....
మాయాబజార్ నుండి పని చేసిన మంత్రం ఇదే .... అప్పుడు .. ఇప్పుడు .. ఎప్పుడు పనిచేసే మంత్రం కుడా ఇదే ....

Don’t think like that :
అద్భుతమయిన ఫ్రేమ్స్ .. షాట్స్ .. లొకేషన్స్ .. సెట్స్ ఏమి సినిమా ని నిలబెట్టవు
అద్భుతమయిన  డాన్సులు .. ఫైట్ లు సినిమా ని నిలబెట్టవు.....
కేవలం  అద్భుతమయిన కధ, స్క్రీన్ ప్లే, దానికి తగ్గ నటీనటులు.. పేపర్ మీద కధను స్క్రీన్ మీద కు మార్చే  డైరెక్టర్, కెమెరా మాన్, మ్యూజిక్ అండ్ పాటల రచయితలు, ఎడిటర్ .. వీళ్ళ తర్వాతే ఎవరైనా .....
Creative clues :
ప్రేక్షకుడ్ని ఆధ్యాత్మిక లోకం .. భక్తికి దగ్గర చేసే సినిమాలు ..
 Examples :  అన్నమయ్య .. దేవుళ్ళు .. శ్రీ రామదాసు ... శ్రీ మంజునాథా
ప్రేక్షకుడు (మగ / ఆడ) ఇగో ని సంతృప్తి పరిచే సినిమాలు ..
Examples : ఖుషి, గుండె జారి గల్లన్తయ్యిందే ...
ప్రేక్షకుడు ఐడెంటిఫై అయ్యే సినిమాలు
Examples : దిల్ చాహతా హై .. హ్యాపీ డేస్ ... బొమ్మరిల్లు ... రంగ్ దే బసంతి ...
Aప్రేక్షకుడి లో లేనిది - తట్టి చూపే మానవత్వపు సినిమా కధలు ......
Examples : గమ్యం .. వేదం .. ఆనలుగురు ...
ప్రేక్షకుడు కోరుకున్నది అన్దేటట్టు చేసే - ఆశావాద సినిమా కధలు.....
Examples : చాలెంజ్, నరసింహా
ప్రేక్షకుడు పొందలేనిది పొందేటట్టు చూపే కధలు .. మనీలవ్ కధలు
Examples : మనీ, డి డి ఎల్ .. అరుణా చలం
ప్రేక్షకుడు చేరుకోలేని లోకాన్ని చూపే అద్భుత కధలు
Examples : యమదొంగ, యముడికి మొగుడు, యమలీల
ప్రేక్షకుడు ఊహించలేనిది జరిగేలా చేసే కధలు
 Examples : లగాన్ .. ఆర్య .. ఐతే
ప్రేక్షకుడు కి వుండే అసంతృప్తిని తీర్చే సినిమాలు
Examples : అపరిచితుడు, ఒకే ఒక్కడు, రంగం, భారతీయుడు, టాగోర్
ప్రేక్షకుడి ని ఆనందింప చేసే సినిమాలు .. కామెడీ కధలు
Examples : జంధ్యాల సినిమాలు
ప్రేక్షకుడు ని త్రిల్ చేసే సినిమాలు .. Thrillers
Examples : ఐతే. అనుకోకుండా ఒక రోజు. అనసూయ
ప్రేక్షకుడి ని బయపెట్టే సినిమాలు ... Horror సినిమాలు ..
Examples :మంత్ర
ప్రేక్షకుడి కి తెల్సిన విషయాలనే కధలుగా మలచిన సినిమాలు
రాజకీయ నాయకుల జీవితాలు ... Examples : ఇద్దరు. సర్కార్ .. సర్కార్ రాజ్.. రక్త చరిత్ర
 క్రీడాకారుల జీవితాల మీద సినిమాలు .Examples : చక్ దే ఇండియా ,బాగ్ మిల్కా బాగ్ , గోల్
 సినిమా వాళ్ళమీద తీసే  సినిమాలు ... Examples : ది డర్టీ పిక్చర్ .. సీతామాలక్ష్మి
మాఫియా వాళ్ళమీద తీసే సినిమాలు ... Examples : కంపెనీ, సత్య, డి
సమాజం లో జరిగే సంఘటన మీద తేసే సినిమా కధలు
Examples :గాయం, 9/11 ముంబై దాడి

Read More............

0 comments:

Post a Comment