Artical-10a


ప్రేక్షకుడి ని దృష్టిలో పెట్టుకుంటే ... అనుక్షణం అతని కోణం లో ఆలోచిస్తే ....
ప్రతీ సీన్ లో ప్రేక్షకుడు ఏమి ఫీల్ అవుతాడు ... నెక్స్ట్ సీన్ కి వెళ్ళాలంటే ఎంత ఉత్సుకత గా చూస్తాడు ... మాటల్లోంచి మలుపులు వస్తే ... ట్విస్ట్ లు జరిగితే ఎలా ఫీల్ అయి .. ఎలా ఎదురుచూస్తాడు ....
చెప్పే తిన్ లైన్ కరెక్ట్ గా ప్రేక్షకుడి గుండె కి చేరుతుందా? లేదా? చేరాలంటే ఇంకా ఏమి క్యారెక్టర్ లు వేయాలి? ఇంకా ఏమి సీన్ లు వేయాలి? ఏమి మలుపులు .. ఏమి ఇన్సిడెంట్స్ సృష్టించాలి ... ఇలా ఆలోచించాలి ... స్క్రిప్ట్ యజ్ఞం లా జరగాలి
 సినిమా ఆసాంతం చూసాక ఏమి ఫీల్ అవుతాడు? - - టైం పాస్ అంటాడా? బాగుంది అంటాడా? బలే తీసాడ్రా అంటాడా? కొత్త పాయింట్ .. కొత్తగా తీసాడు అని అంటాడా? సినిమా చూసి వచ్చి తప్పకుండా చూడాల్రా .. అని అంటాడా? సెకండ్ టైం హాల్ కి వస్తాడా ... ఇలా అన్ని కోణాలు ఆలోచిస్తే ... ఎందుకు హిట్ రాదు ...
Final clue:
మధ్యపిజ్జాహిట్ ..
స్వామీ రారాహిట్
గుండె జారి గల్లంతయిందేహిట్ .. మూడు డిఫరెంట్ సినిమాలే ...
పాయింట్ 1: పిజ్జా లో సైకాలజీ ప్లే ... ఒక బ్లఫ్ గేమ్ వుంది ..
పాయింట్ 2: ఒక ఫాంటసీ పాయింట్ తో .. నెక్స్ట్ ఏమి అవుతుంది .. అనే స్క్రీన్ ప్లే
పాయింట్ 3: హీరో - హీరోయిన్ మధ్య జరిగే ప్లే ... మాటలతో మలుపులు ... అటు ఆడవాళ్ళ సైకాలజీ కి .. మగవాళ్ళ సైకాలజీ కి జరిగిన ఆట ...
ఇవే ప్రేక్షకుడు కి కొత్తదనాన్ని అందించాయి .... చాలా సినిమాలు వస్తుంటాయి ... పోతుంటాయి ... సినిమా అయితే ప్రేక్షకుడి కి ఒక అనుభూతి .. ఫీలింగ్ ఇస్తుందో .. అదే సినిమా ఆడుతుంది ... మిగిలినవి వస్తాయి .. పోతాయి ...
అందుకనే ప్రేక్షకుడు ఎందుకు మన సినిమా చూడాలి? చూస్తాడు? అని ... ప్రేక్షకుడ్ని లాక్ చేయాలంటే ఏమి చేయాలో ఆలోచించాలి .. స్టొరీ లో .. స్క్రీన్ ప్లే లో .. సీన్ లలో ... షాట్ లలో ... అప్పుడు మీరు తప్పకుండా సక్సస్ అవుతారు ...
Before writing any script :
సినిమాకి సినిమా లెక్కలు మారతాయి ... స్క్రిప్ట్ మారుతుంది ... మారాలి .. అప్పుడే కొత్తదనం వస్తుంది ... స్క్రిప్ట్ అయినా జీరో లెవెల్ నుండే స్టార్ట్ చేయాలి ... సచిన్ ఎన్నో రికార్డ్స్ కొట్టాడు కదా అని ఊరుకోడు కదా ... అతను టైం పాస్ కోసం గ్రౌండ్ లోకి దిగాడు కదా ... మళ్ళీ 1 .. 2 .. 4 ... 4 ... 4 ... 4 ... ఇలా కొడుతూనే సెంచరీ చేస్తాడు .. అలాగే ప్రతీ స్క్రిప్ట్ కొత్తదే ... పాతది చేసాం .. హిట్ అయ్యింది కదా అని అవే మసాలా ... అవే టైపు సీన్ లు వేస్తె బోర్ కొడుతుంది ... పాత సినిమా స్ట్రక్చర్, స్క్రిప్ట్ పాయింట్స్, క్యారెక్టర్ లు, ప్లాట్ పాయింట్స్, సీన్లు ఒక్కటీ పెట్టలేము .. పెట్టకూడదు ...
అలా పెడుతున్నకొద్దీ ప్రేక్షకుడు మన క్రియేటివిటీ ని పసిగట్టి .. "ముందు సినిమా లో సీన్ ని మార్చి వేసార్రా" అని తేలికగా అనేస్తాడు .. ఛాన్స్ ఇవ్వకూడదు ...
Be think at the writing table (script version time )....otherwise we will  do more work at Editing table ( post production time )

For Next Generation:
ప్రేక్షకుడు సినిమా చూసి స్టన్ అవ్వాలి .. సినిమా లో వున్న పాయింట్ చూసి, కొత్త కోణం చూసి షాక్ తినాలి ... పలానా సీన్ లలో ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు ... బ్లాక్ లో పడి పడి నవ్వుతాడు ... స్టార్టింగ్ లో, మిడ్ లో ప్రీ క్లైమాక్స్ లో ఈల వేస్తాడు ... ఇలా ప్రతీ విషయం ఆలోచించాల్సింది ప్రేక్షకుడి గురించే ... అలా అయితేనే కధ అద్బుతాలు చేస్తుంది .. పెట్టిన పెట్టుబడి కి నాలుగింతలు కల్లెక్ట్ చేస్తుంది ... అంతే కానీ మూర్కం గా రాసిన ఒకే కధ ని .. ఆత్మ విమర్శ చేసుకోకుండా .. ఆడుతుంది అని చెప్పుకుంటూ .. అందులో మసాలాలు పెట్టి అదే తీసి .. డబ్బులు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు చాలా మంది .... ఇది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చేయరని ఆశిస్తున్నాను ...

0 comments:

Post a Comment