Artical -11

Creativity:

ఇది ఒక తీరని దాహం ..ఇది వుంటే ఎన్ని కధలయినా తయారు చేసుకోవచ్చు ...లేక పోయినా బాధ లేదు ..ఇది వున్న వాళ్ళు నీ చుట్టూ వున్నా చాలు .. క్రియేటివిటీ ని ఒడిసి పట్టుకున్న వాళ్ళే చరిత్రలో మిగులుతారు ..మిగిలిన వాళ్ళు  ఎవరికీ గుర్తుండరు ...చివరకు పక్కింటి వారికి కుడా ..ఈ క్రియేటివిటీ ఒకరి సొత్తూ కాదు ..మరెందుకు  క్రియేటివిటీ లేని చాలా సినిమాలు తీస్తున్నారు ..

1.భయం ..కొత్తదనం అంటే భయం ..ప్రేక్షకుడు ఆదరిస్తాడో లేదో అనే భయం
2.ప్రొడ్యూసర్ పెట్టే సేఫ్టీ  రూల్స్
3.హీరోలలో వుండే రీజన్స్ ...

వీటి వల్లనే కొత్త సినిమాలు రావడం లేదు ..కొత్త కధ చెప్పినా ఎవరూ వినడం లేదు ... అప్పుడప్పుడూ  ట్రెండ్ సెట్టింగ్ చేసే కధలు అనుకోకుండా వస్తున్నాయి ...కానీ వాటిల్లాగే మిగిలిన సినిమాలు ఉంటున్నాయి ...క్రియేటివిటీ లేని సినిమాలు ప్రజలు చూడరు ...ఇది నిజం ..దీన్ని విస్మరించి సినిమాలు తీసి ..చేతులు కాల్చుకున్టున్నాము....
క్రియేటివిటీ ఉండబట్టే రాజమౌళి "ఈగ " కి అంత పేరొచ్చింది ..క్రియేటివిటీ వుంది కాబట్టే వర్మ ఇంకా కొనసాగుతున్నాడు ...
కానీ నేటి కాలం చాలా మంది డైరెక్టర్ లు  మొదటి/ రెండవ సినిమా లో ప్రదర్శించిన క్రియేటివిటీ ఎందుకు రెండవ సినిమాల్లో ప్రదర్శించడం లేదు ?(ఆత్మ  విమర్శగా  -జీవిత పాఠం కోసమే ఈ వ్యాసం ..విమర్శించాలని కాదు ..నాకు విమర్శించే అర్హతా లేదు )

దీనికి రెండు కారణాలు వున్నాయి

1.అస్సలు క్రియేటివిటీ లేని కధలను ఎన్నుకోవడం
2.హిట్ అయిన పాత సినిమా కధలాగే ..స్క్రిప్ట్ పాయింట్ /సీన్ లు వుండటం ...ఈ రెండు రీజన్స్ వలన నేటి కలం లో చాలామంది డైరెక్టర్ లు హిట్ ని అందుకోలేక పోతున్నారు ...కొత్త గా క్రియేటివిటీ తో వున్న కధలే రాసుకోండి ..ఒకదానికి ఇంకొక దానికి సంబంధం ఉండకూడదు ...అప్పుడే మీరు సక్సస్ ...
నిజం మాట్లాడుకుంటే  120 సినిమాల్లో 80-90 ఫ్లాప్ లు వున్నాయి
తమిళ్ నుండి వచ్చినవి ఇక్కడ దున్నేస్తున్నాయి ..(కొన్ని పోతున్నాయి )
మరి లోపమంతా ఎక్కడ వుంది ?

1.స్క్రిప్ట్ లో క్రియేటివిటీ లేకపోవడం
2.స్క్రిప్ట్ వర్క్ కి సరయిన టైం కేటాయించకపోవడం ..ఫాస్ట్ ఫుడ్ /ఆమ్లెట్ లాగ స్క్రిప్ట్ వర్క్ జరగడం ...ఇదే పెద్ద కారణం
కొత్తగా సినిమా తీసే టప్పుడు ఆలోచించాల్సినవి ..

1.మన సినిమా కొత్త కధా ? లేదా పాత వాసనా వేస్తుందా ? క్రియేటివిటీ ఉందా?
2.ప్రేక్షకుడు /అంత దాకా ఎందుకు నేను 75 రూపాయలు పెట్టి సినిమా చూస్తానా ?
3.ఇది హిట్ అవ్వడానికి ఛాన్స్ లు ఎంత ?
4.ఇంతవరకు చూసిన సినిమా నా ? చూడని సినిమా నా ? ఇలా ఎన్నో అలోచించి స్క్రిప్ట్ రాయాలి ...
మంచి స్క్రిప్ట్ తో -నార్మల్ డైరెక్టర్ కుడా అద్భుతాలు చేయగలడు..అదే ఒక చెత్త స్క్రిప్ట్ తో  గొప్ప డైరెక్టర్ కుడా  ఏమి చేయలేడు...స్క్రిప్ట్ అంతే అదే మరి ...

Realization:
ప్రతీ వారు వేసుకోవాల్సిన ప్రశ్నలు
1.టాలెంట్ నా దగ్గర ఉందా ? వుందని అనుకుంటున్నా నా ? (ఈ ప్రశ్న ని నిజాయితీ  గా ,ఆత్మ విమర్శ తో సమాధానం చెప్పుకోండి --మీకు మీరే )
2.అనుభవం నాకు ఉందా ? ఇప్పటివరకు చేసిన కష్టం వలన అది వచ్చిందా ?..లేదా ?
3.ఇప్పుడు ఛాన్స్ వస్తే నేను  పూర్తి సినిమా తీయగలనా ?
వీటికి సమాధానం పోజిటివ్ గా వుంటే ...సినిమా తీయవచ్చు ..లేదా మానుకోవచ్చు ...తొందరేమి వద్దు ...టాలెంట్ ,అర్హత ,అనుభవం ముందు సంపాదించండి ...మీరు  ఎక్సలంట్ అవ్వండి ..సక్సస్ మీ వెనకే  వస్తుంది ...

Suggestion :
1. ఇండస్ట్రీ లో చాలా మంది మొదటి సినిమా ఎందుకు ఫెయిల్ అవుతుంది?
అనుబవం లేకపోవడం ఒక కారణం .... ప్రొడ్యూసర్ దొరికాడు కదా అని ఏదో ఒక కధ రాసుకుని, తీయడం ... ఛాన్స్ పోతుందేమోనని ఒక బాధ ... డబ్బు పోతుందని ఇంకొక బాధ / ఫ్రెండ్స్ అందరూ "ఇంకా డైరెక్టర్ వి కాలేదా" అని అంటారనే బాధ ... ఏజ్ ప్రాబ్లం ఒక పక్క .. పెళ్లి అయినవారికి ఇదే సంపాదన అయితే ఇంకొక ప్రాబ్లం ... పెళ్లి కాని వారికి అప్పుల ప్రొబ్లెమ్స్ .. ఇలా ఒకొక్కటీ కొత్త వాళ్ళని రూల్ చేస్తాయి ... ఇవన్నీ కలసి మొదటి సినిమా తీయడానికి తొందర పెడతాయి .. ఇవన్నీ వుంటాయి .. కానీ స్క్రిప్ట్ విషయం లో పక్క దారి పట్టకూడదు ... కచ్చితం గా హిట్ కొట్టే సినిమా .. కొత్త కధనే ఆలోచించండి .. రాసుకోండి .. తీయండి..

మీకు నచ్చిన మంచి స్క్రిప్ట్ దొరికే వరకు, కంప్లీట్ అయ్యేంతవరకు - డైరెక్టర్ కాకండి... ఇన్నేళ్ళు శ్రమించింది ఫ్లాప్ తీయడానికా? ఒక సారి ఆలోచించండి ....
ఫస్ట్ సినిమా మంచి సినిమా అయితే ఫ్లాప్ అయినా రెండవ సినిమా వుంటుంది ..
ఫస్ట్ సినిమా చెత్త సినిమా తీస్తే ..రెండవ సినిమా ఎప్పుడువుంటుందో చెప్పడం కష్టం ...

2. పాత తరం దర్శకులకు అనుభవం వుండటం వలన మొదటి సినిమా ఫ్లాప్ అయినా కుడా రెండవ సినిమా చాన్సులు వెంటనే వచ్చేవి ....
ఇ .వి.వి .సత్యనారాయణ గారికి "చెవిలో పువ్వు " మొదటి సినిమా ...ఇది ఫ్లాప్ అయ్యింది ..అయినా రామానాయుడు గారు పిలిచి సినిమా ఇచ్చారు .రెండవది "ప్రేమ ఖైది "...ఇది నేటి తరం లో ఎంత మందికి సాధ్యం అవుతుంది ?
మొదటినుండి వచ్చే ప్రతీ అవకాశం ఉపయోగించుకోండి ....అదే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది..కష్టపడి ,చెమట పెట్టి ..రక్తం పోసి స్క్రిప్ట్ రెడీ చేయండి ..మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ...సింపుల్ గా చెప్పాలంటే ..మీరు/మేము ఇంతవరకు చూడని సినిమా /మీరు ఊహించుకున్న సినిమా ని అర్ధవంతం గా ప్రజెంట్  చేయండి ..విజయం మీదే ...Read More...


0 comments:

Post a Comment