Artical -13


For young Generation :
త్వరగా విజయం అందుకోవాలని చూసే నేటి కలం యువత కోసం నా అభిప్రాయాలు ..
ముఖ్యం గా మూడు రకాల వాళ్లు  డైరెక్టర్ లు అవుతున్నారు
AA A.షార్ట్ ఫిల్మ్స్ తీసి డైరెక్టర్ అవ్వాలని అనుకునేవాళ్లు 
B .1,2,3 సినిమాలకు అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన వాళ్ళు
C .అసలేమి అనుభవం లేని వాళ్ళు .... ఈముగ్గురు కోవలోనే చాలామంది డైరెక్టర్ లు అవుతున్నారు ... సినిమాలు ఓకే అవుతున్నాయి ... తీస్తున్నారు ... అయితే ఎంతమంది విజయతీరాలను చేరుతున్నారు? చాల తక్కువ మంది హిట్ అవుతున్నారు ఎందుకని? కారణాలు చూద్దాము ...
Reasons for Failures:
1.Lack of Intension to get success:
విజయం పొందాలంటే మనం "భయంకరమైన ఆకలి" తో వుండాలి ... అది ఎలా ఉండాలంటే "ఎలాగయినా సక్సస్ కొట్టాలి" అని నరం, నాడుల్లో జీర్ణించుకుని వుండాలి ... సక్సస్ కోసం ఏమి చెయ్యాలో ఆలోచించాలి .. కష్టపడాలి ... ఇది చాలామంది లో వుండటం లేదు ... మిగిలిన వాటి మీద శ్రద్ధ పెడుతున్నారు .. ఇది కరెక్ట్ కాదు ..
2.We should not feel “proud” –what we know about :
మనకు ,మన ఆలోచనల్లో ఉన్నదే గొప్ప కధ అనే గర్వం ఉండకూడదు .. కధ సినిమా గా మారిస్తే హిట్ అవుతుందా ? లేదా ? హిట్ చేయాలంటే ఎలాంటి కధ వుండాలి ? చుట్టూరా వస్తున్న కధల మధ్య మన కధ ఎలా వుంది ? క్రియేటివిటీ  ఉందా? లేదా ? కొత్త కోణం ,కొత్త అనుభూతి ... సినిమా ద్వార ఇస్తున్నామా ?లేదా ?...అసలు కధే బాలేదు అని ఎవరయినా అంటే -వేరే  కధ  రాసుకునే సత్తా ఉందా ? వేరే వారి దగ్గర నుండి కధ తీసుకునే వ్యక్తిత్వం ఉందా లేదా ?...నేనే అన్ని చేసుకోవాలి ...నా క్రియేటివిటీ గొప్పది ..అని చెత్త స్టొరీ ని పట్టుకుని ..దాన్నే రాసి రాసి ..తీస్తున్నారు ....అందుకనే చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ...
ఇక్కడ ముఖ్యం గా  "ఆత్మ విమర్శ"  లేదు ...
3.Less time for script work :
స్క్రిప్ట్ వర్క్   తు ..తు.. మంత్రం గా జరగడం ...లైన్ ఇది ,క్యారెక్టర్ లు ఇవి ..సీన్స్ ఇవి ..దానికి మాటలు  ..ఇది కాదు స్క్రిప్ట్ వర్క్ అంటే ..
A.ప్లాట్ లైన్ సరిగ్గా వుండాలి ..దీనికే ఎక్కువ టైం కేటాయించాలి ..ఇది సరిగ్గా వుంటే కధ కరెక్ట్ గా వుంటుంది ...అసలు ప్లాట్ లైన్ చెబితే సినిమా కనపడాలి ... క్రియేటివిటీ కనపడాలి ..కొత్తగా వుండాలి ..ఇప్పటివరకు చూడలేదు అనిపించాలి ...ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో కలవకూడదు...రొటీన్ గా ఉందా ..పక్కకు పెట్టాలి ...కానీ అది చేయరు ..
B.తర్వత ప్లాట్ లైన్ తగ్గట్టు స్ట్రక్చర్,స్కెలిటన్ తయారు చేయాలి ..దానికి తగిన క్యారెక్టర్ లు   వేయాలి ...ముఖ్యమైన మలుపులు ,డ్రైవ్ లు అన్నీ వేసుకోవాలి ..
C.ఇంక సీన్ లు ... ప్లాట్ లైన్ కి తగిన ,స్ట్రక్చర్ లో ఇమిడిపోయే సీన్ లు వేసుకుంటూ వెళ్ళాలి ...సీనిక్ ఆర్డర్ రెడీ చేయాలి ...ఇక్కడే మార్పులుంటే కరెక్ట్ చేసుకోవాలి ...ఇక్కడే మూడు ,నాలుగు డ్రాఫ్ట్ లు తయారు అవుతాయి ....
D.ఎక్కడ సినిమా స్టార్ట్ చేయాలి ? ఎక్కడ ఎండ్ చేయాలి ? ఇంట్రెస్ట్ రావాలంటే స్టొరీ ఎలా వెళ్ళాలి .. కొత్తగా ఎలా చెప్పాలి ? అన్నది స్క్రీన్ ప్లే లో డిస్కషన్ లో తేలాలి ...
E.చివరిగా సీన్ కంటెంట్ చెడకుండా ..అర్ధవంతమయిన మాటలు వుంటూ  సీన్ అన్ని రాసుకోవాలి ..ఇక్కడ 2,3 డ్రాఫ్ట్ లు అవుతాయి ...ఇలా చేయాలంటే 3-6 నెలలు పడుతుంది ..కానీ మనకు అంత ఓపిక లేదు 7-15 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి ..త్వరగా రాయాలి..త్వరగా తీయాలి త్వరగా వెళ్లిపోవాలి ...అది  పరిస్తితి ....
F.రాసిన పూర్తి స్క్రిప్ట్ ను డైరెక్టర్ బాగా జీర్ణం చేసుకోవాలి ...సీన్ పేపర్ చూడకుండా డైరెక్ట్ చేయగలగాలి ..అంతలా మైండ్ ప్రిపేర్ అవ్వాలి ....ఇవన్నీ చేస్తున్నదెవరు?
G.సీన్ లు కొన్ని కెమెరా వలన ,నటన వలన ,కొన్ని డైరెక్టర్ వలన ,కొన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వలన ,కొన్ని ఎడిటింగ్ వలన  కొన్ని మాటలు వలన ఇలా రకరకాలుగా హైలైట్ అవుతాయి ...అవన్నీ తెలియాలి..లేదా తెలుసుకుని ఒక విజన్ ,విజువల్ సెన్స్ తో తీయాలి ...ఇలా తీస్తున్నారా ? ఇదంతా స్క్రిప్ట్ బాగా జీర్ణం చేసుకున్నప్పుడే సాధ్యం అవుతుంది ...
4.Branding : (మీరు ఫాల్లో అవ్వొచ్చు ..కాకపోవచ్చు)
మొదటి సినిమా తోనే నీ బ్రాండ్ ఏమిటి ? అని చెప్పగలగాలి ..అంటే నీవు మొదటి అడుగు తోనే ఒక ముద్ర ప్రేక్షకుడి గుండెల్లో వేయాలి ... కధ పడితే కధ చేస్తే హిట్ రావొచ్చు కానీ ..బ్రాండ్ రాదు ...నీ స్టైల్ ఏమిటో చూసుకోవాలి ..నీ స్త్రెంగ్థ్ ఏమిటో పసిగట్టి ఆదారిలో వెళ్ళాలి ...చాలామంది బ్రాండింగ్ లేక ఒక హిట్ కొట్టి కుడా కాలీగా వున్నారు ...అలా మీరు కాకూడదు ....
5.Lack of planning :
రాసుకున్న పేపర్ స్క్రిప్ట్ --స్క్రీన్ మీద కు కన్వర్ట్ కావాలంటే  ప్లానింగ్ వుండాలి ..దానికి  షెడ్యూల్ డివిజన్ ...డైరెక్టర్ టీం గట్టిగా వుండాలి ...కెమెరామెన్ కీలకం ..డైరెక్టర్ +కెమెరామెన్ అన్న దమ్ముల్లా కలసి ఆలోచించాలి ....క్వాలిటీ లో రాజీ పడకూడదు ...ఇది బాగుంటే రెండవ సినిమా కచ్చితం గా వస్తుంది ...ప్రమోషన్ కుడా జాగర్త గా ప్లాన్ చేసుకోవాలి .... సినిమా కి అయినా కష్టం ఒక్కటే ..ఫలితాలే మారతాయి .... ఫలితం ఎక్కువగా డైరెక్టర్ టేస్ట్ +జడ్జి మెంట్ +విజన్ మీద ఆధారపడి వుంటుంది ...ఇవన్నీ ఎంచుకున్న స్క్రిప్ట్ మీదే ఆధారపడి వుంటాయి ..
-----------------ఇవన్నీ సినిమా వరకు ---------------------------------------
About character : సినిమా తీద్దామనే వ్యక్తి చాలా మంచి క్యారెక్టర్ కలిగి వుండాలి ...దానివలన చాలా లాభాలు వుంటాయి ..కానీ ఇక్కడ వ్యక్తులు ఎలా వున్నారో చూద్దాము....
1.     చాలా మంది లో నిజాయితీ వుండదు ...ఓపెన్ గా వుండరు ...ముసుగేసుకుని జీవిస్తారు ...దానివలన ఒకరికి తెలియకుండా ఒకరు నష్టపోతారు ....
2.     ప్రస్తుతానికి డబ్బు వస్తుంది కదా --అని డైరెక్టర్ ,అసిస్టెంట్ ,అసోసియేట్స్  ఏదో ఒక స్క్రిప్ట్ చెప్పి పబ్బం గడుపుతారు ...దీనివలన తాత్కాలిక సుఖం తప్ప ఏమి ఒరగదు ...అది తెలుసుకునే సరికి వన్ ఇయర్ అవుతుంది ..నష్ట పోవలసినది అంతా నష్టపోతారు ....
డబ్బు శాస్వితం కాదు ..వస్తుంది పోతుంది ..క్యారెక్టర్ పోయాకా  ఎవరు దగ్గరకు రానివ్వరు ....సక్సస్ కోసం శ్రమించండి ..అదే వస్తుంది ..దాని తర్వాత డబ్బు ,పేరు  ప్రొడ్యూసర్ ,మీడియా రూపం లో మీ ఇంటి ముందు క్యూ కడతాయి ....
3.     మొదటి సినిమా అయ్యాక నెక్స్ట్ సినిమా కధ ఉందా ? అంటే వుండదు ...కనీసం లైన్ కుడా వుండదు ..అలాంటివి ఆలోచనలే లేకుండా ఇండస్ట్రీ కి వస్తున్నారు ..ఇది చాలా కష్టం ...మీ దగ్గర ఎంత లేదన్నా 20 -30 లైన్స్ వుండాలి ..5 -7 స్క్రిప్ట్స్ వుండాలి కంప్లీట్ గా ..కనీసం సీనిక్ ఆర్డర్ అయినా వుండాలి ...
విజయం ఎప్పుడూ నెమ్మదిగా వస్తుంది ..దానికోసం చాలా కష్టపడాలి ..తొందరపడకూడదు ....ఒకే సారి వర్మ లా ..పూరి జగన్నాథ్ లా ..రాజమౌళి లా కాలేము ...వాళ్ళే ఎంతో శ్రమించారు ..మనం ఎంత ?”
ఇండస్ట్రీ లోకి వచ్చేవాళ్ళు మూడు దశలు అనుభవిస్తారు ..
1.ఏమీ తెలియని దశ
2.కొంచెం తెలిసి -కొంచెం తెలియని దశ
3.పూర్తిగా తెల్సిన దశ (ఇంకా మిగిలే వుంటుంది --అయితే సినిమా తీయడానికి పనికి వస్తే చాలు అనే దశ )
1.ఏమీ తెలియని దశ :
దశ లో చూసిన సినిమా లను పొగుడుతూ -తిడుతూ ,దిరెచ్తొర్స్ ని తిడుతూ -పొగుడుతూ .."నేను ఇలా తీసేవాడిని "అని ...కొంతమంది కాపీ కొట్టిన సినిమాలను నిజామా కాదా అని సోదించి ...ఇండస్ట్రీ లో వచ్చే పుకార్లను చర్చిస్తూ కాలం గడుపుతున్టాము ...సొల్లు మాటలు ....(ఇది నేను చేసాను )
తర్వాత అసిస్టెంట్ గా ట్రై చేస్తాము ..ఇందులో కొందరే  సక్సస్  అవుతారు ..తర్వాత కొందరే కొనసాగుతారు ...కొందరు ఆకలి .పేరెంట్స్ ,ఆర్ధక బాధలకు ఫీల్డ్ వదిలేస్తారు ...
2.కొంచెం తెలిసి -కొంచెం తెలియని దశ:
రెండవ దశ లో రెండు మూడు సినిమాలకు పనిచేయడం వలన కాస్త నాలెడ్జి వస్తుంది ...పూర్తిగా రాదు ...సీన్స్ గురించి కొందరికి తెలుస్తుంది ...షాట్స్ గురించి కొంత ...బ్లాక్స్ గురించి ఇలా అన్నీ కొంత కొంత మాత్రమె తెలుస్తాయి .... నాలెడ్జి తో కధ చెబుతాడు ,...అలాగే స్టొరీ ని కుడా" బ్లాక్స్ పెట్టానంటే "..అని షాట్స్ ని కుడా చెబుతూ ఉంటాడు ..కానీ పూర్తి స్టొరీ ని అలా చెప్పలేరు ....ఎందుకంటే
ఇక్కడ 1.మెకానికల్ వర్క్  2.క్రియేటివిటీ వర్క్ లు వుంటాయి ....ఇవి రెండు కొన్ని విషయాలు నేర్పుతాయి ..మొదటిది సినిమా ఎలా తీయాలి అనేది ప్రాక్టికల్ గా నేర్పిస్తుంది ....రెండవది సినిమా తీసే ముందు ఎలా ఆలోచించాలో ,ఎంత బాగా ఆలోచించాలో (స్క్రిప్ట్ పరం గా) నేర్పుతుంది ....కొందరికి ఒకటే బాగా తెలుస్తుంది ..ఇంకొందరికి రెండవది ఉన్నట్టే తెలియదు ....అందుకనే రెండు వర్క్స్ తెలియాలి ..
వెయ్యి మంది ట్రై చేస్తే 100 మందికి ఛాన్స్ వస్తుంది ...100 లో 10 మంది ఛాన్స్ ని నిలబెట్టుకుంటారు ..ఒక్కడు సక్సస్ అవుతాడు ...
3.పూర్తిగా తెల్సిన దశ (ఇంకా మిగిలే వుంటుంది --అయితే సినిమా తీయడానికి పనికి వస్తే చాలు అనే దశ )
కొంచెం కామన్ సెన్స్ ..కొంచెం కాన్సంట్రేషన్ ఉంటే ఒక్క సినిమాకే అంతా నేర్చుకోవచ్చు .. బుర్ర మనకు వుండాలి ...మిగిలినవి బోనస్ ...చెప్పుకోడానికి ,ప్రొడ్యూసర్స్ ని కలవడానికి ఉపయోగపడతాయి ...(గమ్యం తీసిన క్రిష్ --ఒకరికి ఒకరు -సినిమాకే వర్క్ చేసాడు ..తర్వాత "గమ్యం" తీసాడు ..వర్మ "రావుగారిల్లు "కి  అబ్సర్వ్ చేసి ,ఒక ట్రయల్ షూట్ తో శివ తీసాడు )
వీళ్ళకి అన్ని శాఖల మీద పట్టు వుంటుంది ...24 క్రాఫ్ట్ లమీద డైరెక్టర్ కి పట్టు వుండాలి ... వీళ్ళకి స్క్రిప్ట్ వర్క్ గురించి బాగా తెలుస్తుంది ... స్క్రిప్ట్ వేల్యూ  కోసం ఎంతో టైం కేటాయిస్తారు ....పొరపాటున వీళ్ళకి మొదటి సినిమా హిట్ కాకపోయినా  రెండవ సినిమా హిట్ కొడతారు ..ఎందుకంటే అప్పటికే వీళ్ళకి  ఫిలిం ఇండస్ట్రీ లో సర్కిల్ ,అనుభవం +నమ్మకం వుంటాయి కాబట్టి....
విజయం అనేది గమ్యం .. ప్రయాణం లో వివిధ దసలు దాటాలి ...అప్పుడే గమ్యం చేరతాము ...ఒకసారి గమ్యం దాటాక అన్నీ టార్గెట్స్ వుంటాయి ...”
గమ్యం ఉందా --దాని అంతు చూడు
రేస్ లో వున్నావా --గెలిచి తీరు ...”
"ఒక్క విషయం " -----:
" కధ ఇలా రాయండి " --అని ప్రేక్షకుడు మనల్ని వచ్చి అడగడు..మనమే రాస్తాము...రాసిందే గొప్పది అనుకుంటాము ..గురివింద మాదిరి ...మన స్క్రిప్ట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో ....ప్రేక్షకుడు సైకాలజీ కి పడుతుందో లేదో ముందుగానే వుహించే డైరెక్టర్ ,రైటర్ లు ఎంత మంది వున్నారు ..తయారవుతున్నారు ? అది తెలుసుకుంటే చాలు ..సెల్ఫ్ చెక్  అవసరం ...
( బ్లాగ్ పెట్టింది విమర్శించడానికి కాదు ..ఆత్మ  విమర్శ  చేసుకోవడానికి ....రాబోయే తరం డైరెక్టర్ ,రైటర్ లు త్వరగా సక్సస్ కావడం కోసం .....మాత్రమే)
ఇండస్ట్రీ లోకి రావడం చాలా కష్టం ...
వచ్చాక సక్సస్ అవ్వడం ఇంకా చాలా కష్టం ...
సక్సస్ ఫుల్ గా కొనసాగడం ఇంకా చాలా కష్టం .....---అమితాబ్ జీ


మన ఇండస్ట్రీ వాళ్ళకోసం యండమూరి ఎనాలిసిస్ ఒక సారి చదవండి ..మీకు ఉపయోగపడుతుంది ...

4 comments:

Unknown said...

super sir ...very nice

Unknown said...

Very Nice...

Subbu said...

Thank you so much larger than information

Subbu said...

Super sir

Post a Comment