Article -9


Article -9
Inspiration
ఒక ప్రొడ్యూసర్ వచ్చి మంచి లైన్ వుంటే చెప్పూ సినిమా తీద్దాం అని అంటాడు ... ఇక అసిస్టెంట్ డైరెక్టర్ తన దగ్గర వున్న లైన్స్ అన్నీ చెబుతాడు ... అవి నచ్చలేదంటాడు .. తీస్తే సక్సస్ కోడతామా? అని డౌట్ లేవదీస్తాడు ...
వారం రోజుల్లో లేదా 15 రోజుల్లో స్క్రిప్ట్ రెడీ అవ్వాలని అంటాడు ... ప్రెస్సర్ పెడతాడు ..
అసిస్టెంట్ డైరెక్టర్ కి, రైటర్ కి - మనీ ప్రాబ్లం.................
ప్రొడ్యూసర్ కి మనీ ఎక్కువగా, ఒకేసారి సంపాదించాలని ప్రాబ్లం......................
అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గాని .. రైటర్ గాని ఏమి చేస్తారు?
 టైం వుండదు ... ఆకలి వుంటుంది ... నిద్ర వుండదు .. Pressure  వుంటుంది ...
జీవితం లో మొదటి అడుగు దగ్గర అలోచిన్చుకుంటాడు ... మధన పడతాడు ...
చేసేదేమీ లేక "కొరియన్" లేదా ఇంగ్లీష్ సినిమాలు చుడడటం మొదలు పెడతాడు ... వారం రోజుల్లో 20,30 సినిమాలు చూస్తాడు ... తెలిసినవి, తెలియనివి, ఫ్రెండ్స్ కి నచ్చినవి, చెప్పినవి .,ప్రొడ్యూసర్ కి నచ్చినవి ,హీరో కి నచ్చినవి . ఇలా చూసి సినిమా లైన్స్ తయారు చేస్తాడు .
ఇవే ఇన్స్పిరేషన్ సినిమాలు ....
కడుపుకాలేవాడికి ... కసి తో రాగిలేవాడికి .. నలుగురుకి అన్నం పెట్టగలిగేవాడికి ... సక్సస్ కొట్టాలనుకునేవాడికి .. సినిమా లైన్ ఎక్కడనుండి తీసుకుంటే ఏమి? ఈ ప్రపంచం వేలివేయదు .. కదా? ఇది చేయడం తప్పుకాదు .. కానీ మక్కికి మక్కీ కాపీ కొట్టడం మాత్రం చేయకూడదు .... అలాచేయల్సినప్పుడు రైట్స్ తీసుకోవాలి ....
Inspiration కి  Copy కి తేడా వుంది ..
Inspiration : మొదటిది .. ఎక్షామ్ హాల్ లో ఫ్రెండ్ ఆన్సర్ ని చూచాయగా చెబితే .. మిగిలిన ఆన్సర్ అంతా అల్లుకుపోవడం ... రాయడం ..
Copy : రెండవది .. ఎక్షామ్ హాల్ లో ఫ్రెండ్ రాసిన ఆన్సర్ పేపర్ ని తీసుకుని మక్కి కి మక్కి రాసుకోవడం ...
ఇన్స్పిరేషన్ లో రకాలు
1. ఇంగ్లీష్ / కొరియన్ / హిందీ / ఇతర బాషల సినిమా ల లైన్స్ తీసుకోవడం
2. బాగా ఇష్టపడ్డ సినిమా కధ లైన్ నుండి కొత్త లైన్ రాసుకోవడం
3. బాగా ఇష్టపడిన సినిమా లైన్ ని ఎక్స్టెన్షన్ చేయడం
4. బాగా ఇష్టపడిన క్యారెక్టర్ తో కొత్తగా వుండే లైన్ తయారుచేసుకోవడం ...
           --------Ok ------Coming to the first type  --------------
1. ఇంగ్లీష్ / కొరియన్ / హిందీ / ఇతర బాషల సినిమా ల లైన్స్ తీసుకోవడం
Examples :
A.గజినీ "ముమేంటో" అనే సినిమా నుండి లైన్, కాన్సెప్ట్ తీసుకున్నాడు ... అందులో మంచి ప్రేమకధ పెట్టాడు ... మంచి స్క్రీన్ ప్లే తో కూర్చోబెట్టాడు ... 100 కోట్లు రాబట్టింది ఆ సినిమా ...
B. సర్కార్, సర్కార్ రాజ్ .. గాయం, సత్య, డి ..
రామ్ గోపాల్ వర్మ తీసే కధల్లో "గాడ్ ఫాదర్" ఛాయలు ఎక్కువగా వుంటాయి .. (. మీరు ఎక్కువ ఏమి సినిమాలు చుస్తే ఆ ఛాయలు తెలియకుండా మీ సినిమాల్లో వస్తాయి) .. అయన గాడ్ ఫాదర్ సీన్ ని వాడడు .. ఆ సీన్ కంటెంట్ తో ఇంకొక సీన్ తయారు చేసుకుంటాడు ... బారత దేశం లో జరిగే, జరుగుతున్న కధలే తీస్తాడు ...
క్షణక్షణం - ఫౌల్ ప్లే, రొమాన్సింగ్ ది స్టోన్, బర్డ్ ఆన్ థి వైర్ .....
C. తేజాబ్ = వర్షం.....
మైనే ప్యార్ కియా + ప్యార్ కియా తో డర్నా క్యా = నువ్వొస్తానంటే నేనొద్దంటానా
వీరు పొట్ల రాసిన కధలు .. కానీ కొత్తగా ఉన్నాయా లేదా? ... అదే కావాల్సింది ...
D. Patch Adams  లైన్ ని తీసుకుని మున్న భాయి ఎం.బి. బి ఎస్ .. అనే సినిమా కధ తయారు చేసుకున్నారు ...
E. Motor cycle dairies లోని మెయిన్ థ్రెడ్ - ఇద్దరు ఫ్రెండ్స్ మోటార్ డ్రైవింగ్ చేసుకుంటూ ... దేశం అంతా తిరగడం .. దాన్ని పట్టుకుని క్రిష్ "గమ్యం" అనే సినిమా కధ రాసుకున్నాడు ...
F. Blue streak  నుండి బ్లేడ్ బాబ్జి తయరైంది ..
G. Eye of the needle  నుండి ఫనా తయారు చేసారు..
H. Millionaire’s first love  నుండి పిల్ల జమిందార్ తయారు చేసారు ...
I. Hitch = పార్టనర్ .. చాల వరకు కాపీ కొట్టడం వలన హాలీవుడ్ వాళ్ళు కేసు వేసారు ...
J.  Good bye Lenin  మెయిన్ త్రేడ్  నుండిదూకుడుతయారు చేసారు..
 Vengeance  మెయిన్ త్రేడ్    నుండిఉసరవెల్లితయారు చేసారు..
ఇలా రాసుకుంటూ పోతే చాలా వున్నాయి .. వుంటాయి ... ఇక్కడ సక్సస్ రేట్ ఎక్కువ .. ఆల్రెడీ హిట్ అయ్యింది కాబట్టి .. ఆ లైన్ ని వాడమంటారు .... ఎందుకంటే మనకు ప్రయోగాలు చేయడం చాలా తక్కువ కాబట్టి ...
       ------------------Ok ------Coming to the Second  type  ------------
2. బాగా ఇష్టపడ్డ సినిమా కధ లైన్ నుండి కొత్త లైన్ రాసుకోవడం
Examples :
A. “శివ సినిమా ని చూసి, ఇష్టపడి "శత్రువు" తయారు చేసారట కోడి రామకృష్ణ గారు
B . ”ప్రేమలేఖ చూసి గుండె జారి గల్లన్తయిందే తీసాడు విజయ కుమార్ కొండా ..
C. “క్షణ క్షణం, అనగనగా ఒక రోజు ను చూసి – స్వామిరారా తీసాడు సుదీర్ వర్మ ...
D. “ డి. డి ఎల్ ని, మైనే ప్యార్ కియా చూసి నిన్నే పెళ్ళాడుతా తీసాడు కృష్ణ వంశి ..
E. భారతీయుడు చూసి టాగోర్ తీసారంటే నమ్మలేమా?
భారతీయుడు లో హీరో ముసలివాడు .. టాగోర్ లో మిడిల్ ఏజ్ పర్సన్
ఒక దగ్గర  C.B.I ఇన్వెస్టిగేషన్ వుంటుంది .. ఇందులో కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ వుంటుంది ...
ఫ్లాష్ బ్యాక్ లు వేరు .. కంటెంట్ ఒక్కటే .. అవినీతి ..
చంపడం ఒకటే .. అక్కడ ఒకేసారి పొడుస్తాడు .. ఇందులో 20 మందిని కిడ్నాప్ చేసి ఒకడ్ని చంపుతాడు ... రివర్స్ గా ఆలోచిస్తే కుడా కొత్త లైన్ రెడీ చేయవచ్చు ..
F. రాక్షషుడు లో లైన్ ని తీసుకుని బ్యాక్ డ్రాప్ మార్చి "చత్రపతి" తీసారు .. కానీ రెండూ కొత్త కధల్లాగే వుంటాయి ... అదే మరి టాలెంట్ ...
g. బాషా సినిమా చూసిసమరసింహా రెడ్డి ,నరసింహ నాయుడు, ఇంద్ర, సింహాద్రి రాసుకున్నారు ... అయితే ఇందులో సింహాద్రి బాగా మార్పులకు గురి అయ్యింది కాబట్టి బాగా హిట్ అయ్యింది ...
ప్రతి 7 ఇయర్స్ కి ఇండస్ట్రీ లోకి కొత్త నీరు వస్తుంది .. వాళ్ళు చూసిన సినిమాలను వేరొక రూపం లో రాసుకుంటారు .. అది సహజం ... కానీ గుర్తుపట్టేసేలా ఉండకూడదు ....
             ----Ok ------Coming to the Third  type  ----------
3. బాగా ఇష్టపడిన సినిమా లైన్ ని ఎక్స్టెన్షన్ చేయడం
Examples :
A.    ఖుషి సినిమా అందరికీ గుర్తే .. ఆ రెండు క్యారెక్టర్ లు పెళ్లి అయ్యాక .. విడిపోతే .. వాళ్ళకి ఒక కొడుకు పుడితే ... వాడి కధే కొంచెం ఇష్టం కొంచెం కష్టం...
B.     ఆర్య అందరికీ తెలుసు .. ఒక అమ్మాయిని ఇద్దరు లవ్ చేస్తే ... దీన్ని కొంచెం ముందుకు తీసుకుని వెళితే .. ఒక అమ్మాయిని నలుగురు లవ్ చేస్తే ... అదే బెట్టింగ్ బంగార్రాజు
ఇది పూర్తిగా తెలివితేటలకు సంబంధించినది .. దీనికి పేరు పెట్టలేము ...
             --------Ok ------Coming to the Fourth  type  -------------
4. బాగా ఇష్టపడిన క్యారెక్టర్ తో కొత్తగా వుండే లైన్ తయారుచేసుకోవడం ...
Examples :
A."వివాహ బోజనంభు" అనే జంధ్యాల సినిమా వుంది .. అందులో రాజేంద్ర ప్రసాద్ పెళ్లి ని ద్వేషిస్తాడు .. ఆ క్యారెక్టర్ ని తీసుకుని .. "మన్మధుడు" గా మార్చాడు త్రివిక్రమ్ ...
ఇలాంటి ఆలోచనలు రావడం ఒక టాలెంట్ .. దీనికి పేరు పెట్టకూడదు ...

Original is always Original …..

చిన్న సంఘటన ద్వారా .. వాక్యం, సూక్తి .. యాడ్ ... కధ .. నవల చదివి, చూసి  సినిమా కధ గా అల్లుకోవచ్చు ..
జీవితానుభావాలనుండి సినిమా కధలు పుట్టించవచ్చు ..
ఒక మాయాబజార్ ... ఒక సాగరసంగమం .. ఒక శంకరాభరణం .. ఒక ప్రేమాభిషేఖం ... . పుష్పక విమానం .... సింధూరం .... ఐతే ... హ్యాపీ డేస్ ...ఆ నలుగురు .. బొమ్మరిల్లు ... రంగ్ దే బసంతి .. లగాన్ ... పాన్ సింగ్ తోమర్ ... డర్టీ పిక్చర్ ... చక్దే ఇండియా ..... లగే రహో మున్న భాయి .... ఒకే ఒక్కడు .. భారతీయుడు .. . పీప్లి లైవ్ ..
ఇలా ఎన్నో ఇండియా లో జరిగిన ఇన్సిడెంట్స్ ద్వారా ... గొప్ప వాళ్ళ క్రియేటివిటీ ద్వారా గొప్ప సినిమాలు వెలుగులోకి వచ్చాయి ... అవి అలాగే నిలిచి వుంటాయి .... ఇలాంటి కోవలోకి వెళ్లి తీస్తే అందరికీ మంచిదే .. కానీ అంత టైం ఎవరు ఇవ్వడం లేదు ..
ఫాస్ట్ ఫుడ్ గా కధ రెడీ అవ్వాలి .... ఒకడికి సక్సస్ కావాలి .. ఒకడికి డబ్బు కావాలి ... ఇద్దరికీ టైం లేదు ... అందుకే ఈ పరిస్తితి ... ఇది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ... ఐడియాలు రానప్పుడు .. టైం లేనప్పుడు ఈ దారి బాగానే వుంటుంది .. కానీ అన్నీ అలాంటి సినిమాలే తీయకండి .. మీకంటూ కొన్ని ఆలోచనలతో వచ్చిన అసలు కధ ను మెరుగులు పెట్టండి .. అదే మంచి కధ అవుతుంది ... బెస్ట్ అఫ్ లక్

0 comments:

Post a Comment