Bombay

Bombay

ఒకే ఫార్ములా తో కధలు తీయడం కంటే కాలీ గా ఇంట్లో కూర్చోవడం బెటర్ అనే వ్యక్తి మణిరత్నం .... అతను అందించిన ఒక క్లాసిక్ "బొంబాయి" ...
సున్నిత మైన అంశాలతో ఎవరైనా సినిమా తీయడానికి సాహసం చేస్తారా?
ముస్లిం - హిందూ గొడవల నేపధ్యం లో సినిమా తీస్తే .... మత ద్వేషాలను రెచ్చగొట్టిన వాళ్ళం అవుతామని ఎవరూ సినిమా తీయడానికి ప్రయత్నించరు ...
బాబ్రిమసీద్ కుల్చివేతల టైం లో జరిగిన అల్లర్ల నేపధ్యం తో ముడి వున్న ప్రేమకధ ని తీసాడు మణిరత్నం .... డైరెక్టర్ అనే వాడు అలాగే వుండాలి ... తను ఎంచుకున్న కధాంశం మీద గట్టిగా నిలబడాలి ... అది హిట్ అయి తీరుతుంది అనే నమ్మకం తో వుండాలి .. అలాగే తీయాలి ... . రాజీ పడే ధోరణి డైరెక్టర్ కి ఉండకూడదు .... అప్పుడే కొత్త సినిమాలు వస్తాయి ...
ఈ ఒక్క సినిమా తీయడం వలన "బొంబాయి" పేరు "ముంబాయి" గా మారింది ... అదే సినిమా కున్న పవర్ ....
        ----Ok ---------------Coming to the point -------------

నిజం గా మాట్లాడాలంటే ఫార్ములా లేని సబ్జెక్టు .. విలన్ లేడు .. పరిస్తితే విలన్ ..... ఫైట్ లు వుండవు ... సినిమా కధ కు ఉపయోగించే పడిగట్టు సూత్రాలేమి ఇందులో లేవు .... కేవలం సంఘర్షణ ..... కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ వున్నాయి ... . అందరూ చూసే కమర్షియల్ పాయింట్ ప్రేమ కధ వుంది .... జరిగిన బొంబాయి అల్లర్లు కుడా కమర్షియల్ పాయింట్ అయితే కావొచ్చు .... కానీ మణిరత్నం చూపాలనుకున్నది ఒక సోల్ వున్న కధ .. అచ్చమయిన భారతీయ కధ ... అంతే ...
Script points:
1. Conflict  in  Love  :
ఒక హిందూ అబ్బాయి .. ఒక ముస్లిం అమ్మాయి .. వీళ్ళిద్దరి ప్రేమకధ .. అక్కడే కాన్ఫ్లిక్ట్ వుంది ... రెండు మతాలు వేరు .. అంతే ఇటు అటు పేరెంట్స్ ఇద్దరికీ ఎలాగు ఇష్టం వుండదు ... మొదట పద్ధతి గా అడగటం ... తర్వాత ఎదురించడం .. చివరిగా లేచిపోవడం ... అయితే పెళ్ళిచేసుకున్నాక కుడా ఈ కాన్ఫ్లిక్ట్ బార్య భార్తలమీద కుడా పెట్టాడు .... వాటితో కొన్ని సీన్ లు కుడా అల్లుకున్నాడు ....

2. Conflict in parents :

హిందూ హీరో పేరెంట్స్ .. ముస్లిం హీరోయిన్ పేరెంట్స్ కుడా పడదు .. కానీ పిల్లలు పుట్టక ముందు ఎలా కొట్టుకునేలా వున్నారో ... పిల్లలు పుట్టాక  సరదాగా ఆట పట్టించుకుని కలసిపోతారు…..
సినిమా కధ లో ఒక కాన్ఫ్లిక్ట్ వుంటే బాగుంటుంది .. రెండు కాన్ఫ్లిక్ట్ లు వుంటే సూపర్ .... కాన్ఫ్లిక్ట్ వలన క్యారెక్టర్ ల మధ్య ఆర్గుమెంట్ లు, గొడవలు, తర్వాత సర్దుకుపోవడాలు ... ఇలా జరిగి .. మన కళ్ళముందు కధ జరుగుతున్న ఫీలింగ్ కనపడదు .. జీవితం జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ... ఆ క్యారెక్టర్ లను తెలియకుండానే ఇష్టపడి .. వాటితో ట్రావెల్ చేస్తాము ..

3. Soul in the story :

రెండు మతాలకు సంబంధించిన వాళ్ళు ప్రేమికులు
ఒకరు హిందూ .. ఒకరు ముస్లిం ...
ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ... బొంబాయి. రిజిస్టర్ ఆఫీసు లో ....
ఇక్కడే దర్శకుడు ఏంటో ఉన్నతం గా ఆలోచించాడు .... వారికి కవల పిల్లలు కలుగుతారు .... అంటే రెండు మతాలు సమానం అని చెప్పకనే చెప్పాడు ...
వాళ్ళకి పేర్లు కుడా బలే పెట్టాడు .... కబీర్ నారాయణ ... కమల్ బషీర్ ... హిందూ ముస్లిం పేర్లు కలిసేలా చూసుకున్నాడు ... బాబ్రీ మసీద్ కూల్చివేత వలన బొంబాయి లో అల్లర్లు జరుగుతాయి .... అప్పుడు దర్శకుడు కవల పిల్లలిద్దరినీ విడదీస్తాడు ... అంటే ముస్లిం - హిందూ లు ఒకే కుటుంబం గా వున్న ఇంట్లోంచి ...
అప్పుడు ఎవరు బాధ పడ్డారు? ముఖ్యం గా కని, పెంచిన తల్లి .. అంటే మనిషా కొఇరాలా .... అంటీ భారతమాత బాధపడింది .....
చివరిగా తండ్రి అరవింద్ స్వామీ (విచక్షణ .. వివేకం) .. అరిచాడు .. గోల పెట్టాడు .. అందరూ కలవమని చేతులు చాచేలా చేసాడు ....
హిందూ - ముస్లిం కలసి వుంటే ఏ గొడవలు వాళ్ళని విడదీయలేవు .. ఏ విపత్తులు ఏమి చేయలేవు అని చెప్పాడు .. అది సోల్ వున్న కధ అంటే ...

4.Scenes:

1.అరవింద్ స్వామి - మనీషా ఇంటికెళ్ళి పెళ్ళిగురించి అడిగే సీన్ .. ఇద్దరి రక్తం ఒకటే అని చెప్పడం ....
2.అరవింద్ స్వామి జర్నలిస్ట్ గా మత పెద్దల్ని అడిగే ప్రశ్నలు
3.మనిషా కి పిల్లలు కలగగానే - నాజర్ ఇంటికి ముస్లిం సాంప్రదాయం గా తీసుకొచ్చే సీన్
4.ఇటుకలమీద "శ్రీ రామ్" అని రాయాలని ముస్లిం వద్దకు వెళ్లి గొడవ పడే సీన్
5.పెళ్లి అయిన కొత్తల్లో భార్య - బారత ల మధ్య ఆకర్షణ - పిల్లల గోలతో ముడి పెట్టె సీన్
6.ఒక్క పాట లో ఎన్నో ఏళ్ళు నడిపేసి .. పిల్లల్ని పెద్దవాళ్ళుగా చేయడం .. (హాల్ గుల్ల సాంగ్)
7. నాజర్ ని బొంబాయి లో ముస్లిం బారి నుండి కాపాడటం….
8. క్లైమాక్స్ సీన్ లో అరవిందస్వామి. మనిషా ల బాధ
ఇలాంటివి ఎన్నో సీన్ లు గుండెల్లో నిలిచిపోతాయి .....

Background Score :

నేపథ్య సంగీతం లో రెహ్మాన్ వచ్చాక చాలా మార్పులు వచ్చాయి ...నాకు ఇటువంటి పాటే కావాలి ..ఇక్కడ ఇలాంటి ట్యూన్ తో వున్న పాటే రావాలి ..ఇక్కడ  కాస్త ఫాస్ట్ బీట్ వుండాలి ....ఇలా ప్రతీ ఒక్కటి డైరెక్టర్ చేయించుకోవడం లోనే సినిమా మ్యూజిక్ ఆధారపడి వుంది .....దీన్ని మణిరత్నం రెహమాన్ తో కలసి అద్భుతాలు చేసాడు .. ప్రతీ సాంగ్ .... అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతమే ....

Final Aspiration :

ఇలాంటి సున్నితమయిన సినిమా కధ లు తీసి మనకీ సున్నితం గా ఆలోచించడంనేర్పాడు మణిరత్నం…..మీలో ఒక మణిరత్నం వుంటే తట్టి లేపండి .
అతని ని ఇష్టపడి , మీకంటూ కొత్తదారిలో పయనించండి ....
ఏ ఫార్ములా కధలకు సరితూగని కొత్త కధలు సృష్టించండి .... ఆలోచించండి ....

0 comments:

Post a Comment