Munna


Main character : He leads the fellowship, makes the decisions .

The character reacts to that incident is what illuminates and truly defines his /her character .

జాన్వి, తన ముసలి వాళ్ళందరితో చేసేది లేక లాయర్ దగ్గరకు వెళ్తుంది .. మున్నా జాన్వి ని, ముసలివాల్లన్దరితో "గాంధీ గిరి" చేయాలనీ బయల్దేరతాడు ... లక్కీ సింగ్ ఇంటి కి ఎదురుగానే "సత్యగ్రహం" మొదలు పెడతాడు ... (ఇక్కడ హీరో సమస్య కి ఎలా స్పందిస్తాడు అన్నదే .. అతని క్యారెక్టర్ చెబుతుంది ... అతను టైం లో నిర్ణయం తీసుకోవాల్సిందే .. అప్పుడే క్యారెక్టర్ ఆక్టివ్ గా వున్నట్టు ..)

Plot point 2: it is really same as plot point 1;it is the way to move the story forward, from act-2  to act-3.

Plot point1 and plot point 2 : these two events are the anchoring moments that become the foundation of the dramatic structure in the screenplay .

ఒక చెంప మీద కొడితే రెండవ చూప మన్నాడు గాంధీ ... రెండవ చెంప మీద కుడా కొడితే? .... మున్నా అదే చేస్తాడు .. తిరగి కొడతాడు ... ఫలితం గా సెల్ లో వుంటారు ...
సర్ కేట్ బాధ పడుతుంటే ... మనం పుస్తకాల్లో, నోట్ల మీదా, .. మన పేరు తో నగరాలు, రోడ్స్ .. విగ్రహాలు వెలుస్తాయి అని ఫ్యూచర్ ఆలోచిస్తాడు ...
జాన్వి కి రేడియో ఉంది ... మున్న తో కలసి గాంధీ గిరి ని స్టార్ట్ చేస్తారు ... "గెట్ వెల్ సూన్" అని లక్కీ సింగ్ ఇంటి అడ్రస్ ఇచ్చి అక్కడకు గులాబీ లు వచ్చేలా చేస్తారు ....

Problem 1 :షేర్ లలో డబ్బులు పోగొట్టుకున్న విక్టర్ ని తండ్రి తో కలుపు తాడు. టాక్సీ డ్రైవర్ అవుతాడు ...(ఇతన్ని చివరి లో వాడుకుంటారు)

problem created : Stakes Raised
గులాబీ లతో ఇబ్బంది పడుతున్న మున్న కి - లక్కీ సింగ్ "​​మున్నా రౌడీ" అని చేబుతానంటాడు ...

Turning point : గాంధీ సలహా మేరకు మున్నా నే నిజం చెబుతూ లెటర్ రాస్తాడు ... జాన్వి కి నిజం తెలిసి దూరం అవుతుంది ..
మున్నా రేడియో లో గాంధీ గిరి ని కంటిన్యూ చేయడం ...
1. పెల్లిచుపులకు వచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే విధానం
2. పక్క వాడి ఫ్లాట్ గోడ మీద ఉమ్ము ఊసే వాడి లో మార్పు ..
3. పెన్షన్ ఇవ్వని ఆఫీసు లోంచి .. ఒక ముసలి వాడు పెన్షన్ అందుకోవడం ...
ఇలా ఒకొక్క ప్రాబ్లం ని మున్నా గాంధీ గిరి తో సాల్వ్ చేసుకుంటూ వెళ్తాడు ..

Hero in crisis:
మున్నా వలన గొడవ తీవ్రం అయ్యింది ... లక్కీ సింగ్ కి మున్న గొడవ వదిలిన్చాలనుకున్నాడు .. అంతే డాక్టర్ ని పిలిచి గాంధీ కి సంభందించిన ప్రశ్నలు అడిగాడు .. గాంధీ మొదటి దానికి సమాధానం చెప్పాడు .. మిగిలిన వాటికి చెప్పలేదు ... మున్నా కి సంభందించిన వ్యాధి ఇది అని డాక్టర్ చెప్పాడు .. మున్నా ని అందరి ముందు వెధవను చేసాడు ... అంతే మున్నా బాధ పడ్డాడు ...
climax: తన ఊరికి వేల్లిపోదాము - అని వెళ్తూ జాన్వి గుర్తొచ్చి రేడియో స్టేషన్ కి వెళ్తాడు ....
లక్కీ సింగ్ తన కూతురు పెళ్లి కోసం - ఒక అబద్ధం ఆడాడు ... అదే పుట్టిన రోజు టైం మార్చడం .. అది కూతురుకి తెల్సి బాధ పడి .. చనిపోవడానికి టాక్సీ లో వెళ్తుంది .. టాక్సీ నడిపేది విక్టర్ ...విక్టర్ మున్న కి ఫోన్ చేయడం .. ఫోన్ లో ప్రాబ్లం ని సాల్వ్ చేయడం .... ఇంకా సాల్వ్ కాదు .. సీదా కళ్యాణ మండపం లోనే సర్కేట్ ద్వారా ... ప్రాబ్లం ని సాల్వ్ చేయడం ... పెళ్లి జరగడం .. మున్న జైలు లోకి వెళ్ళడం ... జాన్వి మారి మున్న దగ్గరకు రావడం ..... అంతా హ్యాపీ ...

“we go the movie to experience emotions we would never want to experience in real life “

మనం సినిమా కు ఎందుకు వెళ్తాము? ఏదో ఒక కొత్త పాయింట్ .. మనం చూడని డ్రామా .. మనం ఎక్స్పీరియన్స్ చేయని దాని కోసం వెళ్తాం .. అది హారర్, థ్రిల్లర్, సామాజిక ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ .... ఇలా సినిమా అయినా .. మనకు మంచి ఎక్స్పీరియన్స్ అందివ్వాలి ... ఒక్క పాయింట్ ఆలోచిస్తే ... ప్రేక్షకుడు గా మారి కధ లు ఆలోచించవచ్చు కదా...
 turning points :

A)మున్న కి గాంధీ కనపడి, అతని ప్రాబ్లం లను క్లియర్ చేయడం
B)లక్కీ సింగ్ ద్వారా - మున్న గోవా ప్రయాణం జరగడం .. దానివలన సెకండ్ ఇన్నింగ్స్ హౌస్ ని కాలీ చేయించడం ....
C)రేడియో ద్వారా "గెట్ వెల్ సూన్" ని ఉదృతం చేయడం
D)మున్నా - జాన్వి కి నిజం చెబుతూ లెటర్ వ్రాయడం ..

Drama point : మున్న గాంధీ గురించి బాగా చదవడం వలన - గాంధీ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు .. మున్న ఒక్కడికే కనపడతాడు .. మిగిలిన వారికి కనపడడు .. విషయం క్లియర్ గా చెప్పి ... కధ రన్ చేస్తారు ... ఇదే డ్రామా పాయింట్ ... ఇది ప్రీ క్లైమాక్స్ లో లక్కీ సింగ్ డాక్టర్ ద్వారా ఓపెన్ చేసి మున్న కి అసలు విషయం తెలియ చేస్తారు ...

write and choose the villain character which is apt for the story :

A) సినిమా కధ లో మున్నా రౌడీ .. విలన్ ఇంకా పెద్ద దాదా అయితే సినిమా అంతా ఫైట్ లతోను .. గొడవలతోను వుండి, కమర్షియల్ సినిమా గా మారిపోయి వుండేది ... ఫీల్ గుడ్ కి దూరం గా జరిగిపోయి వుండేది ... అందుకే లక్కీ సింగ్ ని సాఫ్ట్ విలన్ గా ప్లే చేసారు ..
B)లక్కీ సింగ్ కి ప్రముఖులతో ఫోటో దిగే ఒక హాబీ ఉంది ... అదే బాపు గురించి తెల్సుకుని .. బాపు తో ఫోటో దిగుతూ వున్నప్పుడు సినిమా పూర్తి చేస్తారు ... వా .. ఏమి ఐడియా ...
C)Commerciality ని మిస్ అవ్వకుండా చేసుకుని, విలన్ లో మార్పు కలిగేలా కధ అల్లుకోవడం తో .. సినిమా ఫీల్ గుడ్ గా నిలిచి 10 ఇయర్స్ తర్వాత చూసినా సినిమా బాగానే వుంటుంది ...
అంటే కధ ను బట్టి విలన్ ఎలా ఉండాలో కుడా మనకు తెలుస్తుంది ... ఎంత గొప్పగా ఆలోచిస్తే .. అంత గొప్ప కధ వస్తుంది ...
final points:
ఫస్ట్ హాఫ్ లో వచ్చిన క్యారెక్టర్, సెటప్ కధ కి ఉపయోగపడాలి ..
సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్ లు వస్తే అవికూడా ఉపయోగ పడేలా కధ అల్లగలగాలి ...
కధ కయినా ప్రధాన సమస్య ఒకటే వుండాలి .... అది మార్పులకు గురిఅవ్వాలి ...
ఇంటర్వెల్ తర్వాత కధ ఒక సమస్య లోంచి .. ఇంకొక సమస్య లోకి వెళ్ళాలి ...
సినిమా లో డ్రామా పాయింట్ ఒకటి వుండాలి ... (ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది) ...
హీరో కి ఇబ్బందులు ఎదురవుతూ వుండాలి ... దాన్నుంచి హీరో బయట పడుతుండాలి ...
హీరో గ్రాఫ్ పెరుగుతూ .. ప్రీ క్లైమాక్స్ లో పూర్తిగా పడి పోవాలి ... తర్వాత అనూహ్యం గా పుంజు కోవాలి ... ఇవన్నీ కధ లో వున్నాయి .. కాబట్టే కధ ఒక బౌండరీ లైన్ లో వుంది ... అలా కధ ఒక ప్రెమిసెస్ లో ఉన్నప్పుడే కధ పద్దతిగా వుంటుంది .. దానికి దిశా, నిర్దేశం వుంటుంది ...

0 comments:

Post a Comment