oke okkadu


Oke okkadu

One idea …. "ఒక్క రోజు సి.ఎం అయితే  ...తడాఖా చూపిస్తాను" అని అందరమూ అనుకుంటాము ... ఈ చిన్న లైన్ తో ఒక పెద్ద కమర్షియల్ సినిమా తీయగాలమా?  అదే ఆలోచనలకున్న పవర్ ... అదే తీసి చూపించాడు శంకర్ ...
మీ ఆలోచనలు చాల మందికి పిచ్చిగా, తిక్కగా, ఉండొచ్చు ... కానీ అవే మీకు పేరు తెచ్చి పెడతాయి .... మీ ఆలోచనలు ఎంత భిన్నంగా వుంటే అంత ఎక్కువ పేరు వస్తుంది ... (ఇక్కడ ఆత్మ విమర్శ కుడా వుండాలి)
"మీ ఆలోచనలే ...... మీకు పెట్టుబడి ..."
                   -------------ok -----------coming to the point ----------

Script Points :
1. INCITING INCIDENT :
ఒక కాలేజీ స్టూడెంట్ కి -బస్సు డ్రైవర్ కి గొడవ ..కాస్తా ..ముదిరి ట్రాఫిక్ జం దాకా వెళ్లి ..చివరకు అది దొమ్మీ జరిగే దిశగా వెళ్తుంది ...ఈ ఇన్సిడెంట్ కధ కు కీలకం ...దీనివలన్  కధ మలుపుతిరిగు తుంది ..
A.అర్జున్ కి ప్రమోషన్ వచ్చి  సి.ఎం ని ఇంటర్వ్యూ చేసే బాద్యత మీద పడుతుంది ..
B.రఘువరన్ ని ఇరుకున పెట్టే సమాచారం అంతా లభిస్తుంది ...దానివలనే అర్జున్ ఇంటర్వ్యూ చాలా ఘాటుగా చేస్తాడు ....
2. ఒక పెద్ద గీత వుంది ... దాని పక్కనే ఇంకా పెద్ద గీత గీస్తే ఏమవుతుంది? కంపారిజన్ మొదలవుతుంది .... అదే ప్లే సి. ఎం కుర్చీ మీద పెట్టారు ..
A. రఘువరన్ .. ప్రస్తుత కధలో సి. ఎం .. తన రాజకీయ లబ్దికోసం చిన్న ఇన్సిడెంట్ ని కుడా రాద్దాంతం చేస్తాడు ... నష్ట తీవ్రత పెంచుతాడు ... ఇతనొక బాడ్ సి. ఎం ..
"నష్ట తీవ్రత చూపాక .. దాన్ని పూడ్చే విధం గా వుహాలోకం అల్లితే బాగుంటుంది"
B. జరిగిన ఇన్సిడెంట్ దగ్గర దొరికిన ఆధారాలతో అర్జున్ ... సి ఎం అయిన రఘువరన్ ని ఇంటర్వ్యూ చేస్తాడు ప్రజల తరపున కడిగిపారేస్తాడు ... మాటా మాటా పెరిగి రఘువరన్ సవాలు విసురుతాడు ... హీరో అర్జున్ ఆక్టివ్ క్యారెక్టర్ కాబట్టి -.. సవాలు స్వీకరిస్తాడు
Time lock : హీరో కి వున్నది ఒక్కరోజు .. 24 గంటల్లో తానేంటో నిరూపించుకోవాలి ... అందుకే చాలాపనులు చేస్తాడు ..


ఎనిమిది పనులు చేస్తాడు .. త్వరగా నిర్ణయాలు తీసుకుంటాడు .. అక్కడి కక్కడే సస్పెండ్ లు చేస్తాడు .. పనిలో పనిగా ఫైట్ కుడా చేస్తాడు ...
ఇద్దరిలో ఎవరు గుడ్ సి. ఎం .. సామాన్యుడు అయిన అర్జున్ .. హీరోనే ...
దీని తో ప్రేక్షకుడు హీరో తో ట్రావెల్ చేస్తాడు ...

ఈ కధ మన పురాణాల్లో
వామన అవతారం కి కాస్త దగ్గర పోలిక వుంది ...
ఇదే విషయం "రంగం" లోను చూస్తాము

3.Action –Reaction format : అర్జున్ ఇచ్చిన షాక్ కి రఘువరన్ ఏమి చేస్తాడు ..పగ తీర్చుకోవాలనుకుంటాడు.
A..పెట్రోల్ పంప్--బురదలో ఫైట్
B.అర్జున్ ని టీవీ ఆఫీసు లో తన్నడం
C.అర్జున్ ఇంటిని కూల్చడం ,కరెంటు ,వాటర్ సప్లై కట్ చేయడం
ఇవన్నీ  రఘువరన్ ఇచ్చే రియాక్షన్స్ ...
దానికి విసిగి పోయిన అర్జున్ -మనివన్నన్ (పి.ఎ ) మాటలతో మళ్ళీ సి.ఎం కావాలని నిర్ణయించుకుంటాడు ....ఇంటర్వెల్

4.planting : అర్జున్ సి. ఎం కాగానే పిర్యాదుల పెట్టే ఒకటి ఏర్పాటు చేస్తారు .. దాని తో అన్ని సమస్యల పరిష్కారం చేస్తుంటారు ... ఇది క్లైమాక్స్ లో పనిచేస్తుంది ...

5. Villan actions  : అర్జున్ మళ్ళీ సి. ఎం అవ్వడం వలన రఘువరన్ మిగిలిన పార్టీ ల వారినందరినీ కలుపుకుని అర్జున్ ని చంపాలని ప్లాన్ చేస్తాడుఒకసారి కుదరదు .. రెండవసారి మనిషా కోయి రాలా ఊర్లో బ్లాస్టింగ్ జరుగుతుంది ... దానివలన ప్రేమ కధ దెబ్బ తింటుంది ..మూడవసారి బాంబు బ్లాస్ట్ లో అర్జున్ తల్లి తండ్రులను పోగొట్టుకుంటాడు ...
సిటీ లో ఐదు చోట్ల బాంబు పెట్టారని - పిర్యాదుల పెట్టె ద్వారా తెలుస్తుంది ..అన్ని చోట్లా బాంబు లను తీసేస్తారు ..రఘువరన్ - "అర్జునే బాంబు లను పెట్టి అర్జునే తీసాడు" అనే విమర్శ చేస్తాడు ...

6.Hero Action :Climax
చిన్న ప్లే చేస్తాడు అర్జున్ .. తనకు తాను కాల్చుకుని రఘువరన్ ని బాడీ గార్డ్స్ చేత చంపించేస్తాడు ...

7.Subplot : సినిమా లో ప్రేమకధ వుంది ..అది స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ వుంటుంది ..ప్రేమ ఒకే అయ్యాక ..హీరోయిన్ తండ్రి పెట్టె షరతు హీరో కి సమస్యగా మారుతుంది ...కానీ ప్రజల కోసం మల్లె సి.ఎం అవ్వడం ...మారువేషం లో హీరోయిన్ ని కలవడం ...ఇలా ప్రేమ కధ కుడా చాలా మలుపులతో సాగుతుంది

8.Heart  and crucial scene:

 1 .సినిమా లో అర్జున్ డైరెక్ట్ గా సి. ఎం అయిన రఘువరన్ ని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేయవచ్చు ... కానీ అలా స్క్రిప్ట్ లో పెట్టదలచుకోలేదు ... ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేవాడికి ఒక అర్హత వుండాలి ... అదే విధం గా స్క్రిప్ట్ ప్రకారం సి. ఎం మీద కోపం తెప్పించే ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. .. (స్టూడెంట్ - బస్సు డ్రైవర్ గొడవ) ... దానికి సంభందించిన ఆధారాలు అన్నీ అర్జున్ దగ్గర వున్నాయి ...

ఇన్సిడెంట్ లో గాయపడిన స్టూడెంట్ ని అర్జున్ కాపాడతాడు .. దాని వలన అర్జున్ కి ప్రమోషన్ ఇస్తారు .. ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్తితులు కల్పిస్తారు ....
2.హీరో అర్జున్ ప్రశ్నలు అడుగుతుంటే - "బలే నిలదీస్తున్నాడ్రా" అని అనిపిస్తుంది ... ఇదంతా కధలో కలసిపోయినట్టు వుంతుడే తప్ప - విడివిడిగా వున్నట్టు అనిపించదు .....ఇంటర్వ్యూ లో మాటా మాటా పెరిగి "సవాలు" కి దారి తీస్తుంది ... ఇది ఆర్గుమెంట్ బేస్డ్ స్టొరీ .... ("ఆర్య" కుడా ఇలాంటిదే) .... ఎవరు గొప్ప అని తేల్చుకోవాలి ... విషయం లో అర్జున్ గెలుస్తాడు ... ఇక 
అధికారాన్ని అర్జున్ చేతిలోకి తీసుకుంటాడు ...

Hero-Villain track :

1. కొన్ని సినిమాల్లో హీరో ట్రాక్ .. విలన్ ట్రాక్ ఇంటర్వెల్ ముందు గాని, ఇంటర్వెల్ దగ్గర గానీ కలుస్తాయి ...
Ex : ఒక్కడు, ఒకే ఒక్కడు, ప్రేమికుడు

2. కొన్ని సినిమాల్లో హీరో ట్రాక్, విలన్ ట్రాక్ ఫస్ట్ హాఫ్ మధ్యలో, ముప్పావు బాగం లో కలుస్తాయి ...
Ex : ఆర్య, దిల్, విక్రమార్కుడు

3. కొన్ని సినిమాల్లో విలన్ ట్రాక్, హీరో ట్రాక్ కలిసే ట్రావెల్ చేస్తాయి ..
Ex : మున్నాభాయ్, లగేరహో మున్న భాయ్, 3 ఇడియట్స్, గజని, గబ్బర్ సింగ్, శివ, అరుంధతి

4. కొన్ని సినిమాల్లో సెకండ్ హాఫ్ లో కలుపుతున్నారు ...
స్క్రిప్ట్ బాగుంటే ఇది వర్క్ అవుట్ అవుతుంది .. Ex: రంగ్ దే బసంతి
సరిగ్గా లాజిక్ లేదా ….వర్క్ అవుట్ అవ్వదు .... Ex: హ్యాపీ, జల్సా

0 comments:

Post a Comment