Satya


Satya

ప్రతీ డైరెక్టర్ కి కొన్ని స్ట్రెంగ్త్ (బలాలు) వుంటాయి ....
రాఘవేంద్ర రావు గారికి రొమాంటిక్ పాటలతో కూడిన కమర్షియల్ సినిమాలు ..
దాసరి గారికి త్యాగం, తిరుగుబాటు తో కూడిన కధలు ..
విశ్వనాథ్ గారికి సంగీతం, సంప్రదాయాలు, సంస్కృతి బేస్ చేసుకున్న సినిమాలు
ఇలా ఒకోక్కరికీ ఒకో స్ట్రెంగ్త్ లు వుంటాయి ... పొరపాటున వేరే దారిలోకి వెళ్ళినా .. మళ్ళీ తన ధోరణి సినిమాలే తీస్తారు ...
(మన స్ట్రెంగ్త్ ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం - ప్రతీ ఫిలిం డైరెక్టర్ కి వుంది)
అలాగే రామ్ గోపాల్ వర్మ కి మాఫియా సినిమాలు తీయడం లో అతని స్ట్రెంగ్త్ వుంది ... ఎంతో మంది మాఫియా ని టచ్ చేసి ఉండొచ్చు ..... కానీ ఇండియా లో మాఫియా సినిమా సబ్జక్ట్స్ ని కరెక్ట్ గా, లోతుగా, అర్ధవంతం గా .. సమాజం లో జరిగినట్టు గా ఫీల్ తో తీసిన వాడు వర్మ ఒక్కడే ... అందువలనే వర్మ తన మార్క్ ని నిలుపుకోగలిగాడు .. ఎప్పుడయినా ఫ్లాప్ అయితే .. మాఫియా సినిమా తీసి హిట్ కొట్టుకునే స్ట్రెంగ్త్ వున్నవాడు ... హాట్స్ అఫ్ టు వర్మ
                  -----------------OK-------Coming to the point --------------------
Script points :
1. సత్య జీవితం ముంబై లో అడుగుపెట్టినప్పుడి నుండి చనిపోయేవరకు చోటు చేసుకున్న ఇన్సిడెంట్స్ ... అన్ని కలిపితే సత్య సినిమా ..
A .సత్య జైలు కి వెళ్ళడానికి దారి తీసిన పరిస్తితులు
B .సత్య, బికుమాత్రే స్నేహం .... జైలు లో
C. సత్య, విద్య (ఊర్మిళ) మధ్య ప్రేమ
D. సత్య, బికుమాత్రే ఎదుగుదల
E.మాఫియా ని అనచడం కోసం ప్రభుత్వం చర్యలు .. పోలిసుల చర్యలు
F. బికుమాత్రే మరణం .... సత్య బికు ని చంపిన "బావ్" ఫై పగ తీర్చుకోవడం .. సత్య మరణం

2. కధకు అయినా కొన్ని క్యారెక్టర్ లు అవసరం, ... క్యారెక్టర్ పెట్టామంటే అది కధకు ఎక్కడో ఒక దగ్గర ఉపయోగ పడాలి ....

కొన్ని హీరో ని ఇబ్బంది పెడతాయి .... వాటిని హీరో ఎలా డీల్ చేస్తాడు అన్నది కధ మీద ఆధారపడి వుంటుంది .... (జీవా. .. గురునారాయన్ ..... బావ్ .. కమీషనర్ అమోద్ శుక్లా.).

కొన్ని క్యారెక్టర్ లను హీరో ఇబ్బంది పెడతాడు .... వీళ్ళు హీరో ని ఎలా ఇబ్బంది పెట్టాలని చూస్తారో కుడా కధను బట్టి వుంటుంది .... (బుగ్గ మీద గాటు వున్నవాడు ... పోలీస్ క్యారెక్టర్ ....)

హీరో ప్రేమించే ఊర్మిళ - సత్య గురించి నిజం తెలియనంతవరకు ఒకలా వుంటుంది ... తెలిసాక ఒకలా వుంటుంది ...

హీరో తరపున వుండే క్యారెక్టర్ లు కొన్ని వుంటాయి .. అవే కల్లుమామ, జులపాల జుట్టు వాడు ... బికుమాత్రే .... చందర్ .. ఇలాంటివి .....

3. సత్య కధ మాఫియా కి సంభందించినది .. అంటే సంఘ విద్రోహులది .. వాళ్ళ లైఫ్ వుంటుంది ... వాళ్లకి ఆనందాలు అన్నీ వుంటాయి ... సమాజం, పరిస్తితులు వాళ్ళని అలా తయారు చేస్తాయి ... సత్య అలాగే తయారు అవుతాడు .. బికు మాత్రె ఇంకోలాగా తయారవుతాడు ..... వీళ్ళు గన్ ఉన్నంత సేపు హీరో లు .... వీళ్ళకి విలన్స్ ప్రభుత్వం, పోలీసులు .... వీల్లిద్దరిమధ్య వార్ వుంటుంది .... ఆక్షన్ - రియాక్షన్ లు వుంటూ కధ ముందుకు వెళ్తుంది .... చివరిగా హీరోలు అనుకున్న వారు హీరోలు కాదు .... వీళ్ళ వల్లే సమాజం లో విలన్స్ .. "గన్" పట్టిన వాడు గన్ తోనే మరణిస్తాడు "అనేదే కధ ....
Scenes :

1. ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన చడ్డా అనే వాడ్ని ఇద్దరు స్కూటర్ మీద వచ్చి ట్రాఫిక్ లో చంపుతారు ... తర్వాత పారిపోతుంటే స్కూటర్ స్కిడ్ అయి వెనక వున్నా వాడి కాలి మీద పడుతుంది ... వాడ్ని వదిలేసి రెండవవాడు పరిగెడుతూ ఉంటాడు .. వాడ్ని కెమెరా ఫాలో అవుతుంది ... స్కూటర్ కింద కాలు పడినవాడిని చూపించరు .. కాసేపయ్యాక పోలిసులద్దగ్గ్గర వున్నట్టు .... ఆల్రెడీ పోలీసులు కుమ్మేసినట్టు చూపిస్తారు ... వాడ్ని కొట్టేసరికి "బీకు మాత్రె" అని అరుస్తాడు ... అంతే బికు మాత్రె (మనోజ్ వాజ్ పేయి) అరెస్ట్ .. జైలు కి ....
జైలు లో కొన్ని సీన్ తర్వాత ... అదే క్యారెక్టర్ కోర్ట్ లో అబద్దం చెబుతుంది ... అంతే కట్ ... బికుమాత్రే రిలీజ్ అయ్యాడని - సాంగ్ తో ఓపెన్ చేస్తాడు ...
ఇక్కడ బికుమాత్రే జైలు నుండి విడుదల ని గోల గోలగా కోర్టు దగ్గర చేయవచ్చు ... కోర్ట్ లో చాల సేపు చర్చించవచ్చు .. కానీ అవసరం లేదు ... షార్ప్ కట్ లు .. కంటెంట్ అర్ధం అయ్యిందా లేదా అన్నదే పాయింట్ .....
2. సత్య కి బికుమాత్రే గన్ ఇచ్చి "జీవా" ని చంపి రమ్మంటాడు ... సత్య జీవా ని చంపి వస్తాడు ... రోజు రాత్రి మొదటి హత్య చేసిన వాడి మనస్తత్వం ఎలా వుంటుందో చెబుతాడు .... నిద్ర పోవడం కుడా గన్ తోనే చేస్తాడు .. మొదటి సారి నేరస్తుడు ఎంత బయపడతాడో .. అనే టట్టు గా వుంటుంది .. సీన్
3. వకిల్ ములే (గెడ్డం వాడు) డెన్ లోపలి వస్తు అందరినీ కలుసుకుంటూ .. జోకులేస్తూ ... సెటైర్ లు వేస్తూ ... వాతావరణం చూపిస్తూ కెమెరా కదులుతూ వెళ్తుంది .. ఇదే విషయం "పోకిరి" స్టార్టింగ్ లో చూస్తాము ... ఎంతయినా వర్మ Follower కాబట్టి అవి డిఫాల్ట్ గా వచ్చేస్తాయి ...
4.ఊర్మిళ కు సింగింగ్ ఛాన్స్ రావాలని ... మ్యూజిక్ డైరెక్టర్ ఇంటి అద్దాన్ని బులెట్ తో పేల్చి బయపెడతారు ... దెబ్బకు .. ఊర్మిళ కు ఛాన్స్ ఇస్తాడు ...
(గాడ్ ఫాదర్ 1 పార్ట్ లో ఇలాంటి సీన్ వుంటుంది)
5. కమీషనర్ అమోద్ శుక్లా ని చంపుదామని సత్య చెబుతాడు .. మనకు హింట్ ఇస్తాడు .... అమోద్ శుక్లా తన బార్యతో మాట్లాడి బయటకు వెళ్తాడు .. చిన్న సౌండ్ ... ఆల్రెడీ గుండెల్లో బులెట్ వుంటుంది .... చంపడానికి ప్రత్యేకం గా స్కెచ్ లు, ప్లాన్స్ చూపించడు .. మాఫియా అలాగే వుంటుంది ... స్టొరీ డిమాండ్స్ అంతే .. సీన్ అలాగే వుండాలి ...
6. సత్య, ఊర్మిళ తో సినిమాకు వెళ్తాడు .. ఇంటర్వెల్ లో (సత్య స్టార్టింగ్ లో ఒకడ్ని గేదెల కొట్టం దగ్గర కొడతాడు) బుగ్గ మీద గాటు ఉన్న వాడు .. వెంటనే వెళ్లి ఆటో ఎక్కి పోలీసులతో వస్తాడు .... సినిమా అయిపోవడానికి వస్తుంది ... బయట అన్ని గేట్స్ మూసి సత్యని పట్టుకుందామని ట్రై చేస్తారు .. సత్య దొరికిపోతాడు అని అనిపిస్తుంది కానీ. సత్య టైం చూసి గన్ పేలుస్తాడు .. అప్పుడు సత్య, ఊర్మిళ తో కలసి తప్పించుకుంటాడు ... అది సీన్ అంటే ...
7. బావ్ (రాజకీయ నాయకుడు) గెలిచినా తర్వాత సంబరాల్లో టప్ మని "బికుమాత్రే" ని చంపే స్తాడు .... కల్లుమామ లాగే మనమూ షాక్ కి గురి అవుతాము ....
8.పరిగెడుతూ వస్తున్న సత్య కి కల్లుమామ గన్ పెడతాడు .. పక్కనే వకిల్ ములే "చంపు మామ" అంటూ ఉంటాడు ... కట్ చేస్తే వకిల్ ములే చనిపోయివుంటాడు .... రెప్పపాటు కాలం లో ఎన్ని షాక్ లు ..... వా ...

Discussion about scenes :

సీన్ ని ఇంటిలిజెంట్ గా ప్రెజెంట్ చేయడం ...
షార్ప్ గా ఎంత అవసరమో .. అంతే వాడటం .. కట్ చేయడం
సీన్ లో అనవసర గందరగోళాలు లేకుండా చూసుకోవడం .. బడ్జెట్ తగ్గించుకోవడం .. ప్రేక్షకుడిని షాక్ కి గురి చేయడం ..
సీన్ ఒక విధం గా వుహిస్తే .. ఇంకొక విధం గా ఎండ్ చేయడం ...
కెమెరా తో ఆడుకోవడం ..
క్యారెక్టర్ లను అవసరం మేరకు వాడుకోవడం ..
ఇవన్నీ "రామ్ గోపాల్ వర్మ" నుండి నేర్చుకోవాల్సిందే .....

4. ఆవేశం గా వుండే పల్లెటూరి సత్య ని ఫస్ట్ హాఫ్ లో చూస్తాము ...
ఆలోచనల తో (వున్న నాయకుడ్ని) .. సత్య ని సెకండ్ హాఫ్ లో చూస్తాము.
5. సత్య రావడం వలన - బికుమాత్రే "గురునారయన్" ని చంపేస్తాడు ...
బికుమాత్రే స్ట్రాంగ్ గా ఎదుగుతాడు .. ఎదురు వచ్చిన పోలీస్ కమీషనర్ అమోద్ శుక్లా ని చంపేస్తారు - ఊర్మిళ జీవితం లో మార్పులు వస్తాయి ... మాఫియా ముంబై ని ఏలుతుంది ... హీరో రావడం వలన మార్పులు వుంటాయి .... గట్టి నిర్ణయాలు వుంటాయి .. చుట్టూ వున్నా వాళ్ళు ఎదుగుతారు. ... ఇలా గ్రాఫ్ ఎదుగుదల కనిపిస్తే సినిమా హిట్ అవుతుంది .... తర్వాత ఎలాగు మాఫియా సినిమా కాబట్టి ఒక్కొక్కరిని చంపుకోవడాలతో సినిమా పూర్తి అయి .. ఒక రకమైన ఫీల్ ని అందిస్తుంది ....


1 comments:

sai varma said...

e article ni naa book lo publish chesukuntanu sir , nenu book rastunanu rgv meda, meku ok ayte e ariticle use chesukovacha


sai prtap varma
9966134463
writer

Post a Comment