Artical -12

 

Screenplay :

స్క్రీన్ ప్లే గురించి ఎవరూ లెసన్స్ చెప్పరు .. కానీ మీ కధ మీద మీకు పూర్తి పట్టు వుంటే స్క్రీన్ ప్లే అల్లుకోగలుగుతారు ... ఇదేమి బ్రహ్మ విద్య కాదు ... చాలామంది మనుషులకి సాధ్యమయింది కాబట్టి ....
కధ పూర్తి అయిన తర్వాత .. కధ ను ఎలా ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది. ?
కొత్తగా .. ఇంటరెస్టింగ్ గా ప్రేక్షకుడు సినిమా చూడాలంటే ఎలా వుండాలి?..... అన్నదే స్క్రీన్ ప్లే .
కొన్ని సినిమాలు గమనిద్దాం .. దాని ద్వారా ఒక అవగాహనా ఏర్పడవచ్చు .. (నాకు - మీకు కుడా)

Example :

1.కొన్ని సినిమాలలో మెయిన్ పాయింట్ లేట్ గా స్టార్ట్ అవుతుంది .. దానివలన సినిమా కధ ని స్లో గా స్టార్ట్ చేస్తారు .. ఇది స్ట్రెయిట్ గా చెప్పుకుంటూ వెళ్తుంటారు ... ఎక్కడా కన్ఫ్యూషన్ వుండదు .... ఇది పాత కాలం నుండి చూస్తున్న పద్ధతి ... Examples: దళపతి, నాయకుడు, మాయాబజార్, గుండమ్మ కధ, ఆనంద్, గోదావరి
2. సినిమా లో పాయింట్ మొదటే చెప్పేస్తారు ... (. వాయిస్ ఓవర్ తో  ..). అక్కడనుండి మొదలు పెట్టి. సినిమా చివర వరకు కధ రన్ చేస్తారు ... పాయింట్ చెప్పేసాక డైరెక్టర్ సీన్ లతోను, క్యారెక్టర్ ల మధ్య వచ్చే గొడవలతోను .. . ట్విస్ట్ లు .. టర్నింగ్ లతోను ఆడుకుంటాడు Examples:....ఖుషి ... బొమ్మరిల్లు ... మర్యాదరామన్న, పూల రంగడు
3. సినిమా కధ ని ఇంటరెస్టింగ్ ఓపెన్ చేసి ... హీరో కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని డైరీ ద్వారా గానీ .. వేరొక క్యారెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ తో గాని స్టార్ట్ చేసి ... ఒకానొక పాయింట్ వద్ద. ప్రస్తుతం లోకి వస్తారు .... ఫ్లాష్ బ్యాక్ మిగిలి వుంటే ఇంట్రెస్ట్ రావడం కోసం ఒక లాక్ ఉండేలా చూసుకుంటారు .... అది ఓపెన్ చేస్తూ ఇంకొక ఫ్లాష్ బ్యాక్ .. ఇలా క్లైమాక్స్ దాకా నడిపి ... క్లైమాక్స్ లో లక్ష్యం చేరతారు ....

Examples: 3 ఇడియట్స్, గజినీ ... సాగరసంగమం, శంకరాభరణం
4. సినిమా స్టార్టింగ్ లో ఇన్సిడెంట్ వేస్తారు .. అది కధకు లింక్ వుంటుంది ... సినిమా పాయింట్ చూచాయగా చెబుతారు ... ఈ ఇన్సిడెంట్ లింక్ ని ఫస్ట్ హాఫ్ లో గానీ, సెకండ్ హాఫ్ లో గానీ మెయిన్ ట్రాక్ కి కలుపుతారు ....

Examples:అరుంధతి, రోజా, గులాబి, అనగనగా ఒక రోజు .. అనుకోకుండా ఒక రోజు .. స్వామి రారా ...
5. సినిమా కధలో మెయిన్ పాయింట్ చెప్పకుండా ... మొదటి నుండి ఇంట్రెస్ట్ గా థ్రిల్లింగ్ గా స్టొరీ చెబుతూ ... ప్రీ క్లైమాక్స్ లో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారు ... అదా సంగతి అని అప్పుడు మనకు సినిమా అర్ధం అవుతుంది ... ఈ స్క్రీన్ ప్లే లో ఫస్ట్ హాఫ్ లో వేసే పాయింట్స్ అన్ని లాజికల్ గా, లింక్ బాగా కుదరాలి ...

Examples:  అపరిచితుడు, చంద్రముఖి, జెంటిల్ మాన్, మన్మధ, టాగోర్, అనుకోకుండా ఒక రోజు, అతనొక్కడే
6. కొన్ని సినిమా కధలు వాయిస్ ఓవర్ తో స్టార్ట్ చేస్తారు ... అలా వెళ్లిపోతు .. మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ తో మళ్ళీ లింక్ కలుపుతూ చెబుతారు ....

Examples: హ్యాపీ డేస్, అష్టాచెమ్మా,
7. కొన్ని సినిమాలు క్యారెక్టర్ ప్రకారం వెళ్తుంటాయి ...  అదే క్యారెక్టర్ ద్వారా గానీ ... లేదా పక్కనే వున్నా ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా గానీ లేదా హీరోయిన్ ద్వారా గానీ చెప్పుకుంటూ వెళ్తారు ... అలా కధలోకి వెళ్తారు ...

Examples: ఆ నలుగురు, కిక్ ...
8. సినిమా కధలో ఒక ఇన్సిడెంట్ జరిగితే .. దాని దగ్గర మొదలుపెట్టి ... ఒకో క్యారెక్టర్ కధ ని చెప్పడం ... అలా మూడు కధలు చెప్పి క్లైమాక్స్ కి రావడం ... Examples: యువ
లేదా ఒకో క్యారెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ లో కొత్త నిజాలు చెబుతూ వెళ్ళడం ... Examples: పోతురాజు
పైన చెప్పినదంతా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు చూసి మాత్రమే ...
స్క్రీన్ ప్లే అంటే సినిమా మొదలు దగ్గరనుండి .. చివర వరకు వుండే ప్రతీ షాట్ .. ప్రతీ మాట .. ప్రతీ క్యారెక్టర్ .. అన్నీ లెక్కలోకి వస్తాయి ...

Suggestion:
1. ఎప్పుడయినా ప్రేక్షకుడిని గుర్తుపెట్టుకుని స్క్రీన్ ప్లే రాసుకోవాలి ... ప్రేక్షకుడు తికమక కు గురి కాకూడదు .. అలా గురి అయ్యాడో .. సినిమా అర్ధం కాదు ... అందుకే కధ మొత్తం తెల్సిన తర్వాత ఏ పాయింట్ నుండి స్క్రీన్ ప్లే స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఎవరి పాయింట్ అఫ్ వ్యూ లో చెబితే బాగుంటుంది? ... స్ట్రెయిట్ గా చెప్పాలా? ... అలా చెబితే ప్రేక్షకుడు ఎలా ఫీల్ అవుతాడు .. హీరో క్యారెక్టర్ మీద సానుభూతి వస్తుందా? రాదా? అన్నీ ఆలోచించాలి ... దానికి తగినట్టు స్టార్ట్ చేయాలి ... ఇంట్రెస్ట్ గా వుంటే ఓకే .. లేదా మళ్ళీ వేరొక పద్ధతి లో స్టార్ట్ చేయాలి ...
2. కధను చెప్పే విధానాలు కొన్ని వున్నాయి .. కధను బట్టి ... అవి
A .పాత కధను పాత గా చెప్పడం
B. పాత కధను కొత్తగా చెప్పడం
C. కొత్త కధను పాత గా చెప్పడం
D. కొత్త కధను కొత్త గా చెప్పడం ... ఇవి వున్న దారులు ... చివరి దారి లో వెళ్ళే వారికి పేరు, కీర్తి, హిట్ దక్కే చాన్సులు ఎక్కువ ....

3.కొన్ని సార్లు ఎడిటింగ్ దగ్గరకు వెళ్ళాక కుడా మార్పులు వస్తుంటాయి ... ఎందుకంటే తప్పులు ఒప్పులు చేసేది రెండు చోట్లే కదా 1. రైటింగ్ టేబుల్ 2. ఎడిటింగ్ టేబుల్ ... ఈ రెండింటి దగ్గర మిస్ అయ్యామో .. అంతే సంగతులు .... అందుకనే ఎడిటెడ్ స్క్రిప్ట్ చేసుకుని వుండాలి ... అది షాట్ డివిజన్ గా మార్చుకుని వుండాలి ... అప్పుడు బాగా క్లారిటీ వస్తుంది ... మిగిలింది షూటింగ్ మాత్రమే .. అల్ ది బెస్ట్ ..


Final correction :

ఇంతవరకు రాసిన వన్నీ తెలుగు, హిందీ సినిమాలు చూసి .. అదీ కుడా సినిమా ని రెండో, మూడో సార్లు చూసి రాసినది ... ఎక్కువగా ఫార్ములా సినిమాలు, కొన్ని మంచి సినిమాలు, కొన్ని వెరైటీ సినిమాలు మాత్రమే వున్నాయి .... కాబట్టి ఇది పూర్తి నాలెడ్జ్ కాదు .. (నా దృష్టిలో) ... ఇంకా నేర్చుకోవాల్సింది చాలా వుంటుంది .. వుంది ... నేను చాలా బ్రీఫ్ గా రాస్తున్నాను ... విడమరిచి చెప్పాల్సిన అవసరం వుంది ... మునుముందు అది చేస్తాను ... ముఖ్యం గా ఇంగ్లీష్ సినిమాలు చూడాలి ... వాటిని ఎనాలిసిస్ చేస్తే గానీ ఇది పూర్తిగా రాయలేము ... ఎంత తెలుసుకున్నామని అనుకున్నా .. ఇంకా మిగిలే వుంటుంది ... అదే జ్ఞానం ... అది నేర్చుకుంటూనే వుండాలి ... స్క్రీన్ ప్లే అనేది ఒక సముద్రం ... 

0 comments:

Post a Comment