Script Rule 19



Script Rule 19 :

Hero in Crisis : హీరో కోలుకోని విధంగా, తీవ్ర ఇబ్బంది లో పడాలి .. హీరో ఇక ఏమి పీక లేడు ….హీరో పని అయిపొయింది అన్నట్టు వుండాలి .. ఇది ప్రీ క్లైమాక్స్ లో పెడతారు ... హీరో ఈ పరిస్తితినుండి బయటపడి, తన లక్ష్యం చేరడం తో కధ అయిపోతుంది ...
Example : గజినీ, రోబో, 3 ఇడియట్స్, ఆర్య, పోకిరి, ప్రేమికుడు, అతడు, మర్యాద రామన్న, అమ్మ - నాన్న ఓ తమిళ అమ్మాయి, మల్లీశ్వరి, చంద్రముఖి, నువ్వు నాకు నచ్చావ్, ఆనంద్, హ్యాపీ డేస్, గోదావరి, బొమ్మరిల్లు, డి డి ఎల్ .. లగాన్
1.     గజినీ : అమీర్ ఖాన్ ని విలన్ పొడుస్తాడు అక్కడ జియాఖాన్ ని చంపుదామని విలన్ ప్రయత్నం ... ఇక అమీర్ ఖాన్ ఏమీ చేయలేడు -. అనే టట్టు సీన్ జరుగుతుంది .. అదే క్రైసిస్ .. కానీ హీరో కాబట్టి .. ఆక్టివ్ క్యారెక్టర్ కాబట్టి ... విలన్ ని చంపేస్తాడు ..
2.     3 ఇడియట్స్ : అమీర్ ఖాన్ - రాజు రస్తోగి కోసం ఎక్షామ్ పేపర్ దొంగతనం చేస్తాడు .. అది ప్రిన్సిపాల్ బొమ్మన్ ఇరానీ కి తెల్సి పోతుంది ... వచ్చి అమీర్ ఖాన్ ని గొడుగుతో కొడతాడు ... అమీర్ ఖాన్ బాడ్ బోయ్ అయిపోయాడు ... ఇదే క్రైసిస్ ..
3.     ఆర్య : గీత తను ప్రేమించే విషయం "ఆర్య" కి సూచనా ప్రాయం గా చెబుతుంది .. ఆర్య కి కుడా తెలుస్తుంది .. కానీ ఏమిచేప్పలేని పరిస్తితి .. ఒక పక్క అజయ్, అజయ్ తండ్రి వచ్చి, ఆర్య ని పొగుడుతారు ... అప్పుడు ఆర్య క్రైసిస్ లో ఉంటాడు ... గీత ని అజయ్ కి అప్పగిస్తాడు ...
4.     పోకిరి: మహేష్ ఫాదర్ నాజర్ మరణం ... దానితో మహేష్ క్రుంగిపోతాడు .. ఏడుస్తాడు ... ఆ పరిస్తితే క్రైసిస్ .. తర్వాత అందరినీ చంపిపారేస్తాడు ...
5.     ప్రేమికుడు: రఘువరన్ తో ఫైట్ చేసిన ప్రభుదేవా .. రఘువరన్ దగ్గర బందీ అయిపోతాడు ... డిక్కీ లో ప్రభ్దేవని, నల్లోడిని ఉంచుతారు .. అదే క్రైసిస్ ... అక్కడ నుండి ప్రభుదేవా తప్పించుకొని, బాంబు తీసేయ్యడమే మిగిలిన కధ ...
6.     అమ్మ - నాన్న ఓ తమిళ అమ్మాయి: క్లైమాక్స్ ఫైట్ లో రవితేజ చెల్లెలి కోసం కావాలనే ఓడిపోతుంటాడు ... అదే క్రైసిస్ ... తర్వత ఎలాగు గెలుస్తాడు అనుకోండి ..
7.     మర్యాద రామన్న : సునీల్ ఇంటి నుండి బయటకు రావాలి .. వస్తే చావు .. అదే క్రైసిస్ .
8.     మల్లేశ్వరి: వెంకటేష్ ని కోట అబద్దం చెప్పి నైట్ ఇరికిస్తాడు .. అందరూ వెంకటేష్ ని బయటకు పంపుతారు ...
9.     చంద్రముఖి: రజనీకాంత్ ని నాజర్ కొట్టి బయటకు పంపడం ...
ఈ పాయింట్ చాలావరకు ఫైట్ లలో ప్లే చేస్తారు ... కమర్షియల్ సినిమాలలో హీరో ని కొట్టి పంపడం చేస్తారు ... మంచి సినిమా లలో సీన్ లలో ప్లే చేస్తారు .. క్యారెక్టర్ లు విదిపోయేల సీన్ లు అల్లుకుంటారు ...
ఫీల్ గుడ్ సినిమా లలో కుడా ఈ పాయింట్ వుంటుంది .. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, బొమ్మరిల్లు, ఖుషి, నువ్వునాకునచ్చావ్...
ప్రేమకధలు అయిన డి డి ఎల్, ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా లలో కుడా ఈ పాయింట్ వుంటుంది ...
Final Suggestion : కధ ను బట్టి ఏ విధం గా క్రైసిస్ ఏర్పడాలనేది తెలుస్తుంది ... అతికించి నట్టు పెట్ట కూడదు ..

0 comments:

Post a Comment