Script Rule 20



Script Rule 20 :
Time and Tension Element :

ఏ సినిమా లో అయినా ఈ ప్లే వుంది అంటే అది ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ కి పరుగులు పెడుతుంది ... 10,15,20 నిముషాలు ప్రేక్షకుడిని టెన్షన్ పెట్టించవచ్చు ... అప్పుడు "ఏమి జరగబోతుంది" అనే Curiosity కలుగుతుంది .. అలా కధ క్లైమాక్స్ కి చేరుతుంది ..
తక్కువ టైం లో జరగాలి .. టెన్షన్ తో ప్రేక్షకుడ్ని కట్టి పడెయ్యాలి ... అదే ఈ సూత్రం ...
Example : గబ్బర్ సింగ్, ఖుషి, అలా మొదలయింది, ఒకే ఒక్కడు, శివ, విక్రమార్కుడు, రోబో, భారతీయుడు, యముడు, అరుంధతి, కిక్, లగాన్, మర్యాద రామన్న, ఇడియట్, యమదొంగ, యముడు, ఒక్కడు, ..
1.     గబ్బర్ సింగ్: తమ్ముడు బాంబు పెట్టాక ... తమ్ముడ్ని అడ్డం పెట్టుకుని గబ్బర్ సింగ్ ని చంపాలని సిద్దప్ప నాయుడు అనుకోవడం .. కానీ అది జరగక పోవడం ... గబ్బర్ సింగ్, తమ్ముడి తో కలసి వాగ్ములం ఇవ్వడానికి వెళ్తుంటే సిద్దప్ప నాయుడు సుమోలతో ఫైట్ చేయించడం .. అన్న తమ్ముల్లిద్దరు చనిపోతారేమో అనే టెన్షన్ బిల్డప్ అవ్వడం జరుగుతుంది .. (ఇంటర్వెల్ ముందు కుడా ఇలాంటి డి ప్లే చేసారు)
2.     యమదొంగ: ఒక పక్క ఆయువు తీరిపోతుంది .. ఇంకో పక్క ప్రియమణి ఇబ్బందుల్లో వుంది ... తన ప్రాణాల్ని రక్షించుకోవడానికి గుడిలోకి వెళ్తాడు ... రక్తం వస్తున్నా ఫైట్ చేస్తాడు ... విలన్స్, యముడి చేతిలో హీరో చిక్కాడు .. బలి అవుతున్నాడు అనే పరిస్తితి ... ఈవ్ టెన్షన్ కల్గించే ఎలిమెంట్స్ ...
3.     అలా మొదలయింది: నిత్య మీనన్ పెళ్లి కూతురు డ్రెస్ లో, గోడ దూకి బయటకు వస్తుంది .. అదే టైం లో నాని పెళ్లి ఇంట్లో కి దిగుతాడు .. ఒక పక్క తాగుబోతు రమేష్ వచ్చి నాని ని ఇబ్బంది పెడుతుంటాడు ... వాడి వలన దొరికిపోతాడు .. ఇంకో పక్క నిత్య మీనన్ ఆశిష్ విద్యార్ధి కి తో వెళదామనుకుంటే - అతను నిత్యాని బెదిరిస్తూ ఉంటాడు ... ప్రేమికులిద్దరూ కలుస్తారా? లేదా? అన్న ప్లే వుంటుంది ...
4.     ఒకే ఒక్కడు: సిటీ మొత్తం లో 5 ప్లేసెస్ లో బాంబ్స్ పెట్టారు అని తెలుస్తుంది .. అంతే వెంటనే హీరో రంగం లో దిగి ఒకొక్క బాంబు ని తీసుకుంటూ వెళ్తాడు ... బాంబు పేలుతుందేమో అనే టెన్షన్ వుంటుంది ... ఈ బ్లాక్ అంతా ఈ ఫార్మాట్ లోనే వుంటుంది .
5.     రోబో: రోబో - వసీకరన్ ని చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు - ఆర్మీ సడెన్ గా వస్తుంది .. అక్కడి నుండి గ్రాఫిక్స్ లో రోబో లతో సీన్ లు వస్తుంటాయి ... రోబో లు అల్లడిస్తాయి ... తక్కువ టైం లో ఎక్కువ టెన్షన్ ...
6.     ఒక్కడు: ఒక పక్క కబడ్డీ ఆట టెన్షన్ లో వుంటే ... మరొక పక్క ఓబుల్ రెడ్డి (ప్రకాష్ రాజ్) ని బందీ గా చేసి స్టేడియం గాలరీ లో కుర్చోబెడతాడు ... కాసేపటికి ప్రకాష్ రాజ్ కనపడడు .... మహేష్ బాబు కి టెన్షన్ .. మనకు కుడా టెన్షన్ ..
7.     భారతీయుడు: భారతీయుడు తప్పించుకోవడం ... కొడుకు కోసం రావడం ... కొడుకు ఫ్లైట్ ఎక్కుతుంటే ఆపడం ... ఇంకో పక్క సి.బి. ఐ ఆఫీసర్ చేజింగ్ ... ఇక్కడ సినిమా బాగా టెన్షన్ కల్గిస్తుంది ...
8.     యముడు:. ప్రకాష్ రాజ్ ముఖ్యమంత్రి కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు .. అక్కడి నుండి సూర్య పరుగులు పెడుతూ ... వాడ్ని పట్టుకోవడం కోసం సాహసాలు చేస్తూ వెళ్తాడు .. వాడి దగ్గరకు చేరతాడు ... ఇవన్నీ టెన్షన్ కల్గిస్తూ .. Curiosity తో చూసేలా చేస్తాయి ..
9.     కిక్: పోలీస్ ఆఫీసర్ ని పక్కనే పెట్టుకుని రవితేజ దొంగతనం చేస్తాడు ...
10.                        లగాన్: భారి స్కోర్ చేజింగ్ ... బాటింగ్ చేస్తుంది - అమాయకులు ... ఇక టెన్షన్ వుంటుంది .. అది చూడటమే బెటర్ ...
11.                        3ఇడియట్స్: ప్రిన్సిపాల్ కూతురికి ప్రసవం చేయడం .. అదోలా అనిపించినా - అమీర్ ఖాన్ ని కధ ప్రకారం జీనియస్ గా చూపాలి .. అందుకే తప్పలేదు ... ఆ బ్లాక్ అంతా టెన్షన్ మయమే..
ప్రతి సినిమా లోను ఇది వుంటుంది .. కధ ని బట్టి వుంటుంది ... కమర్షియల్ సినిమాలలో ఫాస్ట్ సీన్ లలో వుంటుంది. సీన్ నుండి వేరొక సీన్ దొర్లిపోతుంటాయి ..... ఫీల్ గుడ్ సినిమాలలో స్లో సీన్ లలో వుంటుంది ... అంతే తేడా ...


0 comments:

Post a Comment