Script Rule -22


Script Rule : 22

If any plan is revealed in the story, that may not going to be succeed..Otherwise 
audience feel bore ..

సినిమా స్టొరీ లో ప్రేక్షకుడి కి తెల్సిపోయిన ప్లాన్ వర్కౌట్ కాకూడదు .. తెల్సిందే జరిగితే ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు ..

Examples :

1.ఐతే : హైజాక్ ప్లాన్ రివీల్ చేస్తాడు విలన్ ... ఆ ప్లాన్ ప్రకారమే కధ జరుగుతుంది అని ప్రేక్షకుడు ఊహిస్తాడు ... కానీ వేరేవిధం గా జరుగుతుంది .. హైజాక్ జరిగినా అందులో విలన్ ఉండడు .. హర్షవర్ధన్ ఉంటాడు ... ప్లాన్ కుడా ఫెయిల్ అవుతుంది..
2. అతడు : 1. మహేష్ బాబు ప్లాన్ చేస్తాడు .. కానీ అది జరగదు ...2. సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం ప్లాన్ వేస్తాడు .. అది జరగదు ... రివర్స్ అవుతుంది
3. కృష్ణ  : సునీల్ ఉంగరం తో ఒక ప్లాన్ వేస్తాడు .. అది కాస్తా రివర్స్ అవుతుంది ... ఫలితం గా సునీల్ ఉంగరం పోతుంది ..
4. మనసంతా నువ్వే : హీరో సిరివెన్నెల సీతారామ శాస్త్రి దగ్గర "ప్లాన్ గా నా ప్రేయసిని కలుసుకుని ప్రేమిస్తానని" చెబుతాడు .. ఇది విన్న హీరోయిన్ తనే అలా చేయడం మొదలుపెడుతుంది ...
5. నువ్వొస్తానంటే నేనొద్దంటానా : ఇందులో రఘుబాబు రెండు సార్లు ప్లాన్ చేస్తారు ... రెండు సార్లు ఫెయిల్ అవుతాడు ...
6. ఒకే ఒక్కడు : అర్జున్ ని చంపాలని రఘువరన్ టార్గెట్ పెడతాడు ...
  మొదటి సారి పొలం లో సెక్యూరిటీ వలన సేఫ్ అవుతాడు .. రెండవసారి బాంబు బ్లాస్ట్ ఇంట్లో జరగడం వలన ఫాదర్, మదర్ చనిపోతారు ...
7. శివ : భవాని - శివాని .. వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపడానికి టార్గెట్ పెడతాడు .. కానీ ప్లాన్ కొంత వర్క్ అవుట్ అవుతుంది కొంత కాదు ... శివ సేఫ్ అవుతాడు ... శుభలేఖ సుధాకర్ చనిపోతాడు ...
8. గాయం : 1.వర్మ తెలివైన వాడు కాబట్టి .. సగం ప్లాన్ చెప్పి మిగిలింది ఆ తర్వాత చూద్దాం అని మనకు ట్విస్ట్ ఇచ్చి .. హీరో ని అరెస్ట్ చేయిస్తాడు ...2. ఇదే గాయం లో సినిమా హాల్ లో జగపతి బాబు ని చంపాలని నీలకంట రౌడీ వస్తాడు ... బాల్కనీ లోంచి గన్ గురిపెడతాడు .. జగపతి అవుట్ అని అనుకుంటాము .. కానీ పక్కనే వున్న రౌడీ చనిపోతాడు .. (ఇది మాటలతో కాకుండా .. విజువల్ గా ప్లాన్ లీక్ చేసారు)

ఈ రూల్ ని కామెడీ ప్లాన్స్ లలో ... ఆక్షన్ ప్లాన్స్ లలో వాడతారు ...

0 comments:

Post a Comment