Script Rule -21



Script Rule 21 :

 Play in “Screenplay “ :

ఏసినిమా కధలో అయినా స్క్రీన్ ప్లే లో చిన్న ప్లే వుంటే ప్లస్ అవుతుంది .. ఆ ప్లే కుడా ప్రేక్షకుడి కి ముందు తెలిసి ... క్యారెక్టర్ లకు తెలియని సస్పెన్సు ... లా వుంటే బాగా పేలుతుంది ... చివరకు ఆ క్యారెక్టర్ లకు తెలియాలా? లేదా అన్నది కధను బట్టి ఆధారపడి వుంటుంది ...

Examples : దూకుడు, అతడు, దళపతి,
ఈగ, మగధీర, మర్యాద రామన్న, అష్టా చెమ్మా,
టాగోర్, భారతీయుడు, జెంటిల్ మాన్, యువసేన,
మనసంతా నువ్వే, ప్రేమలేఖ, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గుండెజారి గల్లంతయిందే ... నువ్వొస్తావని, అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి, దిల్ తో పాగల్ హై ,
మిస్సమ్మ, పెళ్ళిపుస్తకం, మాలా మాల్ వీక్లీ, నిన్నే పెళ్ళాడుతా, నువ్వు నాకు నచ్చావ్,
రాకెట్ సింగ్, అహన పెళ్ళంట, బావగారు బాగున్నారా (బృందా వనం), గజిని, వాలి, మన్మధుడు, మురారి, డీ, డి డి ఎల్, (ఇంకా చాలా వున్నాయి .. గుర్తుకురావడం లేదు)

Brief Explanation:
1.     దూకుడు: ప్లే 1: తండ్రి కోసం ఇంట్లో మహేష్ తో కలసి అందరూ ఆడే నాటకం
                     ప్లే 2: రేలితి షో లో బాగం గా "బ్రహ్మానందం" ని ఇరికించడం .. వాడుకోవడం ..
                      ప్లే 3డైరెక్టర్ పేరుతో సినిమా తీస్తానని .. "ఎం ఎస్ నారాయణని ఆడుకోవడం
ఈ మూడు ప్లే లు ఒకొక్కటి బయటపడుతుంటాయి ... ఈ ప్లే లన్నీ ప్రేక్షకుడి కి ముందే తెలుసు .. క్యారెక్టర్ లకు తెలియదు ... అందువలనే రెండు ప్లే లతో కామెడీ, ఒక ప్లే తో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది ...
2.     దళపతి: ప్లే 1: కుంతీ లాంటి మదర్ (విద్య) కి .. కర్ణుడి లాంటి కొడుకు (రజని కాంత్) కి మధ్య జరిగేది ... వీళ్ళిద్దరూ కలుస్తార లేదా? అని ప్రేక్షకుడు ఎదురు చూస్తుంటాడు ... కొడుకు మొదట తల్లి ని గుడి లో చూస్తుంటాడు ... సెంటిమెంట్ పండుతుంది ... తర్వాత కోడుకి కోసం తల్లి ఆరాటపడుతుంది ... అప్పుడే డ్రామా వర్కౌట్ అవుతుంది ... చివరిలో తల్లి - కొడుకు కలిసిపోతారు ...
3.     అతడు: ప్లే 1: పార్థు ప్లేస్ లో మహేష్ నాజర్ ఇంటికి వెళ్తాడు .. అక్కడికి వెళ్ళాక సునీల్ తో అంతా చెప్పేస్తాడు (? ... ఎందుకు చెప్పాడు సపోర్టింగ్ క్యారెక్టర్ కాబట్టి)
ప్రీ క్లైమాక్స్ ముందు ఈ ప్లే ఓపెన్ అవుతుంది ...
4.  టాగోర్, భారతీయుడు, యువ సేన, జెంటిల్ మాన్, కిక్ :
ప్లే 1: ప్రజల దృష్టిలో మంచి పని చేసే వీళ్ళు - ప్రేక్షకుడి కి తెలిసి .. ఎవరికీ తెలియని ఒక ఆట అడుతుంటారు ... వెళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఎంటర్ అవుతుంటారు ... ప్రేక్షకుడి కి అన్నీ తెలుస్తుంటాయి ... అప్పుడు ప్రేక్షకుడు వెళ్లాని పట్టుకుంటారా లేదా? అనే ఇంట్రెస్ట్ తో చూస్తుంటాడు ...
5.     ఈగ: ప్లే 1: నాని ఈగ గా మరీనా విషయం ప్రేక్షకుడి కే ముందు తెలుస్తుంది ... తర్వాత సమంతా కి .. చివరిగా విలన్ సుదీప్ కి తెలుస్తుంది ...
6.     మగధీర: ప్లే 1: హీరో కి హీరోయిన్ ని తాక గానే "పూర్వ జన్మ" గుర్తుకొస్తుంది ...
అది చివరి వరకు రన్ చేసి .... చివర్లో ఓపెన్ అవుతుంది ..
ప్లే 2: హీరోయిన్ తననే వెతుకుతున్నాడని .. తను హీరో ని ఆట పట్టించడం ...
7.     మర్యాదరామన్న: ప్లే 1: ప్రేక్షకుడి కి తెలుసు - పగ తో వున్నా వాళ్ళ దగ్గరకు సునీల్ వెళ్ళాడని .. వాళ్ళు చంప బోతున్నారని .... ఇంటర్వెల్ దగ్గర సునీల్ కి తెలుస్తుంది ....
ప్లే 2: గుమ్మం దాటితే చంపుతారని ప్రేక్షకుడి కి తెలుసు ... అది సెకండ్ హాఫ్ లో సునీల్ ని కాపాడుతుంది .... ప్రీ క్లైమాక్స్ వరకు ....
8.     మనసంతా నువ్వే, ప్రేమలేఖ, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గుండెజారి గల్లంతయిందే ... నువ్వొస్తావని, అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి, దిల్ తో పాగల్ హై ,
ప్లే 1:  హీరోయిన్స్ - హీరో ఒకరి తెలియకుండా ఒకరు .. పక్కపక్కనే వుంటూ ప్రేమించుకుంటూ వుంటారు ... ఎదురు పడినప్పుడు తిట్టుకోవడాలు చేస్తారు ... ప్రేక్షకుడి కి తెలుసు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు - కానీ తిట్టుకుంటున్నారు అని .. ఆ పాయింట్ ని ఎంజాయ్ చేస్తారు ... ఈ పాయింట్ ప్రేమికులకు ఎప్పుడు తెలుస్తుందా ..? అని తనకు తెలియకుండా వెయిట్ చేస్తుంటాడు ....
9.     మిస్సమ్మ (ఓల్డ్)  : ప్లే 1:   పెళ్ళికాని వాళ్ళు .. పెళ్లి అయిన వాళ్ళుగా నటించడం
10.పెళ్ళిపుస్తకం  : ప్లే 1:   పెళ్లి అయిన వాళ్ళు - పెళ్ళికాని వారిలాగ ఒకే ఆఫీసు లో వర్క్ చేయడం
11.రాకెట్ సింగ్  : ప్లే 1:  ఒక ఆఫీసు లో వుంటూ - ఇంకొక ఆఫీసు రన్ చేయడం ...
12.  అహన పెళ్ళంట  : ప్లే 1:  రాజేంద్ర ప్రసాద్ సామాన్యుడి గా, పిసనారి కోటా వద్ద చేరడం
13.డి డి ఎల్  : ప్లే 1:  షారుఖ్ ఖాన్ - కాజోల్ ఇంట్లోకి చేరడం
14. రెడీ : ప్లే 1: జనీలియా ని రామ్ ఇంట్లోకి తీసుకు రావడం
             ప్లే  2: రామ్ విలన్ ల దగ్గర చేరడం
15.మాలా మాల్ వీక్లీ:  ప్లే 1:  లాటరీ విషయం ఒకొక్కరికీ తెలుస్తూ వెళ్ళడం
16.బావగారు బాగున్నారా (బృందావనం) : ప్లే 1:  చిరంజీవి - రంభ అక్క - రచన భర్త గా వెళ్ళడం ...
17.  గజినీ: ప్లే 1: అసిన్ - యాడ్ కంపెనీ డైరెక్టర్ అల్లిన కధ ను ... తనకు ఫేవర్ గా తీసుకుంటుంది ... అందలం    ఎక్కుతుంది ..
ప్లే 2: అసిన్ క్యారెక్టర్ చుసిన - సూర్య .. తన స్టేటస్ మర్చి పోయి సామాన్య మానవుడిగా .. సచిన్ గా పరిచయం అవుతాడు ...
రెండవ ప్లే చివరి వరకు అసిన్ కి తెలియదు .... మనకే తెలుస్తుంది ...
18.స్వామి రా రా: ప్లే 1: అఖిల్ దొంగ అనే విషయం స్వాతి కి తెలియనివ్వరు ...
ఇదే పాయింట్ "క్షణ క్షణం" లో వుంటుంది ...

ఈ ప్లే ముందుగా ప్రేక్షకుడి కి తెల్సి పోతే బాగుంటుంది ..
తర్వాత ఏ క్యారెక్టర్ కి తెలియాలి? అందరికి తెలియాలా? కొంత మందికే తెలియాలా? విలన్స్ కి తెలియకుండా ఉండాలా .. లేదా?
ఒకొక్కరికి తెలుపుతూ వెళ్ళాలా?
మెయిన్ క్యారెక్టర్ కి తెలియాలా ... వద్దా?
అందరికీ తెలిసి ఒక్క క్యారెక్టర్ కె తెలియకుండా ఉండాలా?
మెయిన్ క్యారెక్టర్ కి చివర్లో తెలిస్తే ...?
ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వేసుకుని .. ప్రేక్షకుడి పాయింట్ అఫ్ వ్యూ లో ఆలోచిస్తే మంచి కధ కి స్క్రీన్ ప్లే బాగుంటుంది ... ఇది లేకపోయినా హిట్ అయిన సినిమాలు చాలా వున్నాయి .... అవసరమా? లేదా? అనేదే ముఖ్యం ...

0 comments:

Post a Comment