Sources for Plots

Sources for Plots
క్రియేటివిటీ అంటే ఏముంది .. కొత్తగా, అద్బుతంగా, ఇప్పటివరకు చూడని కోణం లో వున్నది .. అది నవ్విస్తుంది .. ఆలోచింపచేస్తుంది .. కవ్విస్తుంది .. ఆనందింప చేస్తుంది .. మొత్తానికి సంతృప్తి పరుస్తుంది .. టికెట్ కొనే ప్రేక్షకుడి కి అదేగా కావాల్సింది ... ఇది దొరికే కొన్ని సోర్సెస్ వున్నాయి. . కానీ అందులో వెతుక్కో గల టాలెంట్ మనకు వుండాలి ... లేకపోతే కష్టం ...

1.Newspapers: Headlines
న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ .. వీటిని జాగర్తగా చుస్తే మనకు ప్లాట్ ఐడియాస్ రావొచ్చు .. ముఖ్యంగా ఆదివారం బుక్ లు ... అన్ని న్యూస్ పేపర్స్ లో కొన్ని వేల మంది ఆలోచనలు - అందులో వుంటాయి ... అవి సరిగ్గా చదివినా చాలు .. ఐడియాస్ పుడతాయి ..
ఐతే ... అమర్ అక్బర్ అంటోనీ .. జెంటిల్ మాన్ ... ప్రేమిస్తే ... ఇలా పుట్టినవే

2.True Stories: చాలామంది జీవిత గాధల్లోంచి సినిమాలు తీసే మెటీరియల్ దొరుకుతుంది ... వాళ్ళ గురించిన పుస్తకాలు .. న్యూస్ .. వాళ్ళకు ఎదురయిన ఇన్సిడెంట్స్ అన్నీ సినిమా ప్లాట్ కి పనికి వస్తాయి ... నాయకుడు .. ది డర్టీ పిక్చర్, ఇద్దరు, రక్త చరిత్ర ..

3.Jokes: కొన్ని యూనివర్సల్ లుక్ వున్నా జోక్స్, కార్టూన్స్ చూడగానే ఐడియాస్ రావొచ్చు .. దాన్ని ఎక్స్టెండ్ చేయడమే సినిమా ...

4.Quotations: కొన్ని కొటేషన్స్ చూసినా .. చదివినా మనకు ఏదో తెలియని అనుభూతి ఏర్పడుతుంది .. దాన్ని ప్లాట్ గా మార్చి .. క్యారెక్టర్ లు వేసి సినిమా గా మార్చుకోవచ్చు ..
పెంపకం మీదే ఆధారపడి వుంటుంది .. దొంగ కొడుకు దొంగ అవుతాడు - ఇలాంటివి వింటే కదా రాయగలమా .. తమిళ్ వాడు అది రాసుకున్నాడు .. సినిమా పేరు "ఉల్లాసం" ... ఇందులో పైన చెప్పిన దాన్ని మారుస్తాడు రఘువరన్ ...

5.Irritations: మనకు చాల విషయాలు విసిగిస్తాయి .. చికాకు పుట్టిస్తాయి ... వాటితో కదా అల్లలేమా? శంకర్ సినిమాలన్నీ ఇవే కదా ... విద్యవ్యవస్త మీద కోపమే జెంటిల్ మాన్ .... . అవినీతి మీద ఒక భారతీయుడి పోరాటం ... మంచి సి ఎం కావాలనుకోవడమే -. ఒకే ఒక్కడు ... సమాజం ఇలా వుంది - దీన్ని మార్చడానికి "అపరిచితుడి" ద్వారా చెప్పే నీతి ... ఇలాంటివి చాలానే వున్నాయి .. మీకోపాన్ని కుడా సినిమా కధలా మార్చుకోవచ్చు ..

6. Values: మోరల్ వాల్యూస్ చాలా వుంటాయి .. వాటిని ఆధారం గా చేసుకునే సినిమా ప్లాట్లు అల్లుకోవచ్చు .. కానీ టైం పడుతుంది ...
సమాజానికి మంచి చేయాలి .. చెడుమాత్రం చేయకూడదు డబ్బు అవసరం .. అంతే గానీ దానికోసం చెడు దారులు తోక్కకూడదు ... అనే వేల్యూ తోనే -. " నలుగురు" పుట్టింది ... మనిషే గెలుస్తాడు .. డబ్బు గెలవదు .. అనేది బాగా చెప్పారు ...

7. Geetha /ramayan/mahabharatha Stories: Myth
 మహా కావ్యాలు అయిన భగవత్ గీత ...రామాయణం ..మహాభారతం నుండి ఎన్ని స్టొరీ లు వచ్చాయి ..లెక్కే లేదు ..అవి అద్భుత ఘని ..తొవ్వుకున్న వాడికి తోవ్వుకున్నంత ....
మాట్రిక్స్ ..మహాభారతం చదివి తీసారు ...రామాయణం చదివి మనం బాపు గారు  చాల సినిమాలు తీసారు (ముత్యాల ముగ్గు ..) వాలి ..ఇందులోనిదే ..గుణశేఖర్ ఇప్పటికి ఫాల్లో అయి చాలా సినిమాలు తీసాడు (ఫ్లాప్  అయినా సినిమా నా కాదా ఇక్కడ ముఖ్యం )..దళపతి ఇందులోనిదే ...

8.Novels : ఎంతో మంది నొవెల్స్ రాసారు ..రాస్తున్నారు ..అవి చదవడానికే 4 5 జీవితాలు పడుతుంది ..1 ఇయర్ లో 52 వారాలు..వారానికి ఒక్కటి చదివినా ..సెంచరీ ఈజీ గా కొట్టొచ్చు ...ఇక మీదగ్గర ఎన్నో ఆలోచనలు వుంటాయి ..(ఒక విషయం --నవల  నుండి ఆలోచనలు పుట్టడం వేరు ..నవలని కొట్టేద్దమనుకోవడం వేరు --అలాగా ఆలోచించకండి )

9.Books of particular writer and stories : ఒక పర్టికులర్ రైటర్ బుక్స్ పదే పదే చదివితే ..వాళ్ళ భావజాలం అర్ధం అవుతుంది ..అప్పుడు మనం కొత్తగా అలొచించగలమ్...చలం ,శ్రీ శ్రీ ..ఓషో ..ఇలాంటివి చదివానని పెద్ద డైరెక్టర్ లు ఇంటర్వ్యూ లలో చదవడం లేదా ?

10.Discussion  or Argument : మనకు నచ్చిన ..మనకు సింక్ అయ్యే ఫ్రెండ్స్ మీద ప్రేమ ..అమ్మాయిల గురించి ..అబ్బాయిల గురించి ...పాలిటిక్స్ మీద ..ఇలా డిఫరెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని డిస్కస్ చేయండి ..కొత్త పాయింట్స్ వస్తాయి ...దానిమీద బేస్ చేసుకుని సినిమా స్టొరీ లు పుట్టవచ్చు ...


11.Final Inspiration by Movies : నచ్చిన సినిమా ..ఫ్లాప్ అయినా సినిమా ..వేరే బాషల సినిమాలు అన్నీ చూసి ఇన్స్పిరేషన్ తో కధలు రాసుకోవచ్చు ..మరో చరిత్ర ఎండ్ నుండి ఆలోచిస్తే ..ఇట్లు శ్రావని సుబ్రహ్మణ్యం ....ప్రేమలేఖను ఆలోచిస్తే -గుందేజారి గల్లన్తయ్యిందే ...ఒక్కడు --భద్ర ...హనుమంతు --సింహా ..ఇక ఇంగ్లీష్ ...జర్మన్ ..కొరియా సినిమాలు మీకు ఎలాగు తెలుసు ....

0 comments:

Post a Comment